గుంటూరు

రాజాధిరాజ వాహనంపై ఊరేగిన లక్ష్మీ నృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 17: పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించిన రాజాధిరాజ వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి లక్ష్మీ నరసింహ స్వామివారు పురవీధుల్లో ఊరేగారు. ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా పెదపాలెంకు చెందిన నరసింహారావు వ్యవహరించారు. ఈనెల 14వ తేదీన పెండ్లికుమారుడైన స్వామివారు రోజుకో వాహనంపై పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజాధిరాజ వాహన రూఢుడై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు నేత్రపర్వంగా దర్శించుకున్నారు. ఊరేగింపులో నెమలి డాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు స్వామివారిని దర్శించుకుని పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయం ఎదుట కళావేదికపై ప్రసాద్ (విజయవాడ) లలిత సంగీతం, సౌమ్య కూచిపూడి నృత్యం, సత్యం భక్తి సంగీతం, గంగాప్రసాద్, సినీ సంగీతం, శివసాయి భక్తసమాజం వారి భజన కార్యక్రమాలు జరిగాయి. సమన్వయకర్తగా మాజేటి సూర్యవేణుగోపాలకృష్ణ వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం యాలివాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని ఇఓ పానకాలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఎగువ, దిగువ ఆలయాలను శోభాయమానంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.