మహబూబ్‌నగర్

విద్యతోనే సమాజం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నవంబర్ 29: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం హన్వాడ మండల కేంద్రంలోని శారాదా బిఇడి ప్రైవేట్ కళాశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరుతో మాట్లాడుతూ వెనకబడిన జిల్లాలో ఉన్నత చదువులకు సంబంధించిన మరిన్ని అవకాశాలు రావల్సిఉందని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వ కళశాలల మాట అటుఉంచి ప్రైవేట్ కళశాలలకు కూడా అనుమతులు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని తెలిపారు. హన్వాడలో బిఇడి కళశాల రావడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఇలాంటి మండలంలో ఉన్నత చదువులకు సంబంధించి కళశాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా బాలికల అక్షరాస్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. గట్టులాంటి మండలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే అందరు చదువుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డిఎస్సీని ప్రకటించనుందని తెలిపారు. బిఇడి చదువు భవిష్యత్ తరాలను తిర్చిదిద్దే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీవర్థన్‌రెడ్డి, డాక్టర్ వెంకటయ్య, రమణారెడ్డి, కొండ వెంకటయ్య, దాసరి కృష్ణయ్య, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్యయ్య, నాయకులు బాలయ్య, ఎంపిటిసి ఆంజనేయులు, మాజీ ఎంపిటిసి మామిడిమాడ బాలమణి, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, బాల్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు ఎనిమిది మినీ ట్యాంక్‌బండ్‌లు
జిల్లా మిషన్ కాకతీయ ఇఇ శ్రావణ్‌కుమార్
ధన్వాడ, నవంబర్ 29: పాలమూరు జిల్లాలోని వివిధ మండలాల్లో గల ఎనిమిది చెరువులను మినీట్యాంక్ బాండ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని జిల్లా మిషన్‌కాకతీయ ఇఇ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ధన్వాడ మండలం మరికల్ పట్టణంలో పెద్ద చెరువును జిల్లా మిషన్‌కాకతీయ ఇఇ శ్రావణ్ కుమార్, జిల్లా మీషన్ కాకతీయ డిప్యూటి ఇఇ సూర్యనారాయణ, ధన్వాడ మండల ఎఇ మంగారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా మీషన్ కాకతీయ ఇఇ శ్రావణ్‌కుమార్, డిప్యూటి ఇఇ సూర్యనారాయణలు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని మరికల్, మఖ్తల్, వనపర్తి, పాలమూరు, నాగర్‌కర్నూల్ డివిజన్‌లో మరో మూడు చెరువులను మినీట్యాంక్ బాండ్లుగా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వారు తెలిపారు. మరికల్ పట్టణంలోని పెద్ద చెరువును మినీ ట్యాంక్ బ్యాండ్‌గా మార్చలని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పేట ఇంచార్జీ శివకుమార్‌రెడ్డి,్ధన్వాడ మండల ఎంపిపి శశికళ,మరికల్ పట్టణ సర్పంచ్ లక్ష్మీ,గ్రామపంచాయతి సభ్యులు లికిత పూర్వకంగా జిల్లా ఇంచార్జీ మంత్రులకు, జిల్లా మీషన్‌కాకతీయ ఎస్‌ఇ కార్యాలయంకు పంపడం జరిగిందని అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికల్ పట్టణానికి మినీట్యాంక్ బాండ్‌ను మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం మరికల్ పెద్ద చెరువుకు చూట్టు బిట్టి రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. చెరువుకు ప్రత్యేకంగా కంచేను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం గణేష్ నిమర్జనం జరుపుకోనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే రెవెన్యూ అధికారులతో చెరువు భూములను సర్వే చేయించడం జరుగుతందన్నారు. చెరువువద్ద ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులను డిసెంబర్ నెలలో చెరువుకు సంబందించిన పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామన్నారు. 2016 జనవరి మొదటి వారంలో మినీట్యాంక్ బాండ్ పనులను ప్రారంబించడం జరుగుతుందన్నారు. అందుకు మరికల్ పట్టణ ప్రజ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరారు. అధికారుల వెంట ధన్వాడ మండల ఎంపిపి శశికళ ,మరికల్ పట్టణ సర్పంచ్ లక్ష్మీ, ఉపసర్పంచ్ రవికుమార్, టిఆర్‌ఎస్ జిల్లా కమిటి సభ్యులు బుచ్చప్ప, ధన్వాడ మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు నాగేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల నాయకులు రామస్వామి, టిడిపి నాయకులు గోపి , బిజెపి నాయకులు సూరిటి చంద్రశేఖర్, ఎబివిపి మండల కో-కన్వీనర్ రాజేష్, సభ్యులు రామేష్,నాయకులు ఎల్.రాములు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.