తెలంగాణ

తెలంగాణలో అడ్డగోలుగా భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణ సర్కారు అడ్డగోలుగా భూసేకరణ జరుపుతోందని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని టి.టిడిపి నేతలు శుక్రవారం ఇక్కడ గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు. భూసేకరణకు సంబంధించి 123 జీవోను హైకోర్టు కొట్టివేసినప్పటికీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లడం తగదన్నారు. ఎంసెట్-2 పేపర్ లీకేజీ నేపథ్యంలో మంత్రులు లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కోర్టుల చేత ఇప్పటికి 16సార్లు మొట్టికాయలు వేయించుకున్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదని టి.టిడిపి నేతలు ఎల్.రమణ, ప్రతాప్‌రెడ్డి తదితరులు అన్నారు.