గ్రహానుగ్రహం

‘గ్రామార్వణం’ జ్యోతిషం పరిధిలోనిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కె.శర్మ (హైదరాబాద్)
ప్రశ్న: ‘గ్రామార్వణం’ అనేది జ్యోతిష శాస్త్రం పరిధిలోనిదేనా?
జ: జ్యోతిశ్శాస్త్ర పరిధిలోనిదే. మనం పుట్టిన ఊరు, మన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పటి ఊరు విషయంలో గ్రామార్వణం చూడనవసరం లేదు. ఉద్యోగరీత్యా మార్పులు తీసుకునే ఊళ్ల విషయంగా గ్రామార్వణం చూడనవసరం లేదు. వ్యాపార విషయంగానూ మరియు రిటైర్మెంట్ లైఫ్ గడిపేందుకు వెళ్లే ఊరు విషయంలోనూ గ్రామార్వణం చూసుకోవడం శ్రేయస్కరం. ఎవరి మీద అయినా ఆధారపడి జీవనం చేయువారికి గ్రామార్వణం అవసరం లేదు.

లక్ష్మీనారాయణ కె. (విజయవాడ)
ప్రశ్న: జ్యోతిషం చెప్పడంలో ‘గోచారం చెప్పడం’ అనే అంశానికి ప్రాధాన్యత ఎంత?
జ: గోచారం అనేది కొంత ప్రభావం చూపుతుంది. దశ అంతర్దశ రూపంలో శోధన చేయటం, దాని ఫలితాలు నిర్ధారించటం ముఖ్యం. అష్టకవర్గులు మొత్తం గోచారంతో ముడిపడి ఫలితాలు చెప్పబడ్డాయి. అయితే గోచారం నక్షత్ర ప్రకారంగా చెప్పేవి సాధారణ స్థాయి ఫలితాలు మాత్రమే అందరకీ ఒకే రకంగా ఫలితాలు చూపవు. మన దశ అంతర్దశకు, అష్టకవర్గుకు ముడిపెట్టి గోచార శోధన చేసిన యెడల ఫలితాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి. సత్ఫలితాలు ఇస్తాయి.

సి.కళ్యాణి (సికిందరాబాద్)
ప్రశ్న: అత్యవసర ప్రయాణాలు చేయాలంటే ముహూర్తం ఎలా చూడాలి? కుదరకపోతే ఏం చేయాలి?
జ: ముహూర్తం కుదిరితే చూసుకోవాలి. లేకపోతే వార శూలలు వాటి మతాంతర వారములు చూడాలి. ఇవి కూడా కుదరకపోతే చివరకు కనీసంగా ‘నిర్ఘ్యం’ అనేది పాటించాలి. మనం ప్రయాణం చేయడానికి తీసుకువెళ్లే వస్తువును - మంచి సమయంలో వేరొక చోట ఉంచి, మనం ప్రయాణం చేద్దాం అనుకున్న రోజు ఆ వస్తువును తీసుకొని వెళ్లటం నిర్ఘ్యం అంటారు. ఇది శాస్త్రం ఆమోదించిన అంశం. ప్రయాణం రోజు మంచిది లేకపోతే ప్రయాణానికి అయిదు రోజుల ముందు ఈ పని చేయాలి.
నందిని (అనంతపురం)
ప్రశ్న: జ్యోతిషం చెప్పేవారు ‘గోపూజ’ చెబుతారు. ఎందుకు?
జ: గోమాత ‘సర్వదేవతా స్వరూపిణీ’ అని పురాణాలు తెలియజేస్తున్నాయి. గ్రహ సంబంధ దోష శాంతి ఒకటే కాకుండా ఏ శాంతి పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు చేసినా గోపూజ తప్పకుండా చేయడం శాస్తవ్రిధి. అలా చేయడం ద్వారా దేవతలను ప్రత్యక్షంగా అర్చించినట్లు. శ్రీ లలితార్చన చక్రార్చనలు చేసిన ఫలితం ఉంటుంది. నవగ్రహముల అధిదేవత శ్రీమాత లలితా దేవి ‘గోమాతా’ అనే నామంతో కీర్తింపబడుతోంది కదా!

రాంబాబు (గుంటూరు)
ప్రశ్న: పంచాంగాలలో రాసే దేశ గోచారం నిర్ణయం ఎలా చేస్తారు?
జ: మనిషి జాతక ఫలితాంశములు నిర్ణయం చేసినట్లే. దీనికి కూడా ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మనకు ‘ప్రత్యబ్ద పంచాంగ సరళి’ ‘సిద్ధాంత సరళి’ ‘బృహత్సంహిత’ వంటి గ్రంథాల ద్వారా ఈ ఫలితాంశము తెలియజేయబడినవి. అర్ఘ ప్రదర్శినీ, అర్ఘమార్తాండం వంటి గ్రంథాలు ధరవరలను తెలియజేస్తాయి. మరి ‘సస్యానందం’ ‘వర్షఫణి చక్రం’ వంటి గ్రంథములు వర్ష సూచనలు ఇస్తాయి. ఇలా మహర్షి ప్రోక్తమయిన గ్రంథాలు ఆధారం.

జానకి (మంచిర్యాల)
ప్రశ్న: జ్యోతిషం చెప్పించుకోవడానికి వెళ్లి కొన్ని ముఖ్య వివరాలు మనం ఇవ్వాలి అంటారు. ఎందుకు?
జ: నేటి సమాజంలో విద్యా విధానాలు, జీవన శైలి మార్పులు, ఆరోగ్య సమస్యలు అన్నింటిలోనూ విచిత్రమైన మార్పులు వున్నాయి. అలాగే ప్రతి అంశంలోనూ ఈ విశేషములు ఉన్నాయి. అందువల్ల ఆ వివరాలు మీరు జ్యోతిషునికి తెలియజేసి మేము ఆ విద్యకు లేక ఉద్యోగానికి అర్హులమా? కాదా? అనే అంశం చెబితే దాని ప్రకారం సిద్ధాంతి తేలికగా ఆ విషయం శోధించేందుకు అవకాశం ఉంటుంది.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336