రాష్ట్రీయం

గ్రామ కంఠాలపై నివేదిక పూర్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 12: రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని గ్రామకంఠాల సమస్యల పరిష్కారంపై తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేసిన సిఆర్‌డిఎ అధికార సిబ్బంది ప్రతి గ్రామానికి సంబంధించిన నివేదికను సమగ్రంగా రూపొందించారు. శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి తయారు చేసిన నివేదికపై రాష్టమ్రంత్రులు, అధికారులు ఆయా గ్రామాలకు చెందిన ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటించారు. రాష్టమ్రంత్రులు పి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించిన సమయంలో వివిధ గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గ్రామకంఠాల పరిధిని పెంచాలనే డిమాండ్ పొలిమేర్లల్లో పొలాలు ఉన్న రైతులనుంచి ఎదురైంది. అంతేకాకుండా దశాబ్దాల క్రితం పొగాకు పండించిన రైతులు తమ బ్యారెన్‌లకు సంబంధించిన స్థలాలను మినహాయించాలని కోరారు.