కృష్ణ

జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని చైర్మన్ ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేక్షర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా రాజకీయ వేత్తలు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తల సమన్వయంతో కృషి చేస్తానన్నారు. స్థానిక సంస్థలు లైబ్రరీ సెస్ కింద వసూలు చేసిన రూ.14కోట్లు గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉందన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ లైబ్రరీ సెస్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా 254 పర్మినెంట్ పోస్టులలో 95 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఖాళీగా ఉన్న 159 పోస్టుల్లో 54 పోస్టులకు కోర్టు కేసుల వల్ల భర్తీ ప్రక్రియను నిలుపుదల చేశామన్నారు. 65 అవుట్ సోర్సింగ్ పోస్టులు భర్తీ చేశామన్నారు. జిల్లాలో 8 ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు, 18 ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు, 83 తృతీయ శ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయని తెలిపారు. 109 శాఖా గ్రంథాలయాల్లో 83 సొంత భవనాల్లో, 7 అద్దె భవనాల్లో, 20 ఉచిత అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఆన్‌లైన్ డిమాండ్ పుస్తకాలకు రూ.16లక్షలు, పుస్తకాల డిజిటలైజేషన్‌కు రూ.10లక్షలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.20లక్షలు, శాఖా గ్రంథాలయాల్లో కొనుగోళ్లకు రూ.85లక్షలు కేటాయించినట్లు తెలిపారు.