బిజినెస్

జిఎస్‌టిని అమల్లోకి తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తుంది
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం
సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మార్చి 13: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), దివాళా బిల్లులు ఆమోదం పొందుతాయన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. వచ్చే నెల 20 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల ద్వితీయార్ధంలో ఈ కీలక బిల్లుల అమలు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇక్కడ అడ్వాన్సింగ్ ఆసియా కాన్ఫరెన్స్‌లో జైట్లీ మాట్లాడారు. జిఎస్‌టి బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందినది తెలిసిందే. అయితే రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో అక్కడ పాసైన జిఎస్‌టి బిల్లు.. రాజ్యసభలో సరైన మెజారిటీ లేకపోవడంతో ఆమోదం పొందలేకపోయింది. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి రాజ్యసభలోనూ గట్టెక్కగలదన్న విశ్వాసాన్ని జైట్లీ ఈ సందర్భంగా వెలిబుచ్చారు. అయితే రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత దేశంలోని 29 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల మద్దతు ఈ బిల్లు పొందాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు అయితేగానీ జిఎస్‌టి బిల్లు అమల్లోకి వచ్చేలా లేదు. నిజానికి జిఎస్‌టిని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రాజ్యసభలో కాంగ్రెస్, ఇతర పార్టీల వ్యతిరేకతతో ప్రభుత్వం ఆశ నెరవేరలేకపోయింది. ‘ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల ప్రథమార్ధంలో రెండు రోజుల క్రితం కీలకమైన ఆధార్ బిల్లుకు ఆమోదం వచ్చింది. రియల్ ఎస్టేట్ బిల్లుకూ అనుమతి లభించింది. మరో రెండు కీలక బిల్లులైన జిఎస్‌టి, దివాళా బిల్లులకూ ద్వితీయార్ధంలో ఆమోదం వస్తుందని భావిస్తున్నాం.’ అని జైట్లీ అన్నారు. ఒకసారి జిఎస్‌టి, దివాళా బిల్లులు అమల్లోకి వస్తే ఇక భారత సంస్కరణల ప్రక్రియ ఊపందుకుంటుందన్నారు. ఇదిలావుంటే ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిరేటు అధికంగానే ఉందని, అయితే చైనా మందగమనం ఆందోళనలు వెంటాడుతున్నాయని జైట్లీ అన్నారు. అయినప్పటికీ భారత్ వీటి ముందు నిలదొక్కుకుంటోందన్న ఆయన గ్రామాలతోపాటు దేశవ్యాప్తంగా వౌలికరంగాభివృద్ధి మరింతగా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు.
కొంత విరామం కావాలి: లగార్డే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ఐఎమ్‌ఎఫ్ తదుపరి సంస్కరణలను ప్రవేశపెట్టాలని భారత్ సూచించిన నేపథ్యంలో అందుకు కొంత సమయం అవసరమని ఆదివారం ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ-అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మాట్లాడుతూ సుధీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కోటా సంస్కరణలు ఎట్టకేలకు 2010లో అమల్లోకి వచ్చినప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను అవి ప్రతిబింబించలేకపోతున్నాయని, కాబట్టి మరోసారి కోటా సంస్కరణలను ఐఎమ్‌ఎఫ్ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలో కోటా సంస్కరణల ప్రక్రియ ఇప్పుడే ముగిసిందని, మరోసారి వాటి అమలుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఐఎమ్‌ఎఫ్‌లో భారత్ కోటా 2.44 శాతం నుంచి 2.7 శాతానికి పెరగగా, ఓటింగ్ శాతం 2.34 శాతం నుంచి 2.6 శాతానికి ఎగిసింది. ఐఎమ్‌ఎఫ్‌లో టాప్-10 సభ్య దేశాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా (బ్రిక్) దేశాలకు తొలిసారిగా చోటు దక్కగా, మిగతా ఆరు దేశాల్లో అమెరికా, జపాన్, ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ ఉన్నాయి. ఇకపోతే బ్రిక్స్ బ్యాంక్‌ను, ఆసియా వౌలికరంగ పెట్టుబడుల బ్యాంక్ (ఎఐఐబి)ను లగార్డే ఈ సందర్భంగా స్వాగతించారు. ఆసియా దేశాల్లో భారత్ వృద్ధి చోదకశక్తిగా ఉందన్నారు. అలాగే భారత ఆర్థిక విధానం పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని కొనియాడిన లగార్డే.. వౌలికపెట్టుబడులను దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనాలుగా అభివర్ణించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఈసారి జిడిపిలో ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గిస్తామని, వౌలిక వసతులపై దృష్టి సారిస్తామన్నదానిపై లగార్డే పైవిధంగా స్పందించారు. కాగా, మూడు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారంతో ముగిసింది.