కృష్ణ

గణతంత్ర వేడుకల్లో 8 శకటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాష్టస్థ్రాయి గణతంత్ర దినోత్సవాలలో రాష్టస్థ్రాయి ప్రగతిని తెలిపే 8 శకతాలు ప్రదర్శించేందుకు నిర్ణయించడం జరిగిందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన గణతంత్ర దినోత్సవాల సమావేశంలో ఇప్పటివరకు ఆయా శాఖలు చేపట్టిన పనులను ఆయన సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శకటంతో పాటు పౌర సరఫరాలు, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ఫ్), పాఠశాల విద్యశాఖలు ఒక్కొక్క శకటాన్ని ఏర్పాటు చేయనున్నాయన్నారు. పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, విద్యుత్ శాఖలు సంయుక్తంగా ఒక శకటాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాభివృద్ధి మున్సిపల్ వ్యవహారాల శాఖ ఒక శకటాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు ఉప రవాణా కమిషనర్‌తో సంప్రదించి వాహనాలు సమకూర్చుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశించారు. ఆయా వాహనాల (్ఫట్‌నెస్) దారుఢ్యాన్ని నిర్థారించి డ్రైవర్ చిరునామా ఇతర సమాచారాన్ని పోలీసు అధికారులకు అందించాలని ఆయన సూచించారు. పరేడ్ సందర్భంగా శకటాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు ఆయన సూచించారు. గణతంత్ర దినోత్సవాల వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని వెంటనే మొదలుపెట్టాలని సాధారణ పరిపాలన శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఆహ్వానపత్రాలతో పాటు వాహనాల పార్కింగ్, ఆవరణలోకి ప్రవేశించే ద్వారం, ప్రోగ్రామ్ వివరాలను ఆహ్వాన పత్రాలతో కలిపి జతపర్చి పంపాల్సిందిగా ఆయన సూచించారు. గవర్నర్ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఒక్కరోజు ముందుగానే విజయవాడకు వస్తున్న దృష్ట్యా ప్రభుత్వ అతిథి గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని కోరారు. అదే విధంగా గణతంత్ర వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో పూర్తిస్థాయి పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. స్టేజ్ ఏర్పాట్లు, వాటర్ ఫ్రూప్ టెంట్లు, సీటింగ్ ఏర్పాట్లు శుక్రవారం లోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండయన్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకల దృష్టా నగరంలోని ప్రకాశం బ్యారేజ్ నుండి ఎన్‌టిఆర్ సర్కిల్ వరకు బందరురోడ్డు అంతట లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా మొక్కలను ఏర్పాటు చేయడం దాదాపు పూర్తికావస్తుందన్నారు. స్టేడియంలో 27 తాత్కాలిక మరుగుదొడ్లు, తాత్కాలిక లైటింగ్, 200 చెత్తకుండీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.