గుంటూరు

సాగర్ డీఈపై ఎస్‌పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యానికి నిరసనగా ఎన్‌ఎస్‌పి సిబ్బంది ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, ఏప్రిల్ 20: నాగార్జున సాగర్ ప్రాజెక్టు డీఈ సాల్మన్‌రాజుపై ఎస్‌పీఎఫ్ సిబ్బంది దౌర్జన్యాన్ని నిరసిస్తూ బుధవారం ఎస్‌ఎస్‌పీ సిబ్బం ది విధులు బహిష్కరించి ఎస్‌పీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్ళితే ఈనెల 14న శ్రీరామనవమి సందర్భంగా పార్కులో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పూలు కోస్తుండగా, అక్కడే ఉన్న డీఈ సాల్మన్‌రాజు పూలు కోయవద్దని హెచ్చరించారు. అక్కడ ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్, డీఈ సాల్మన్‌రాజు వాగ్వివాదానికి దిగారు. ఎస్‌పీఎఫ్ ఉద్యోగులు ఏకమై డీఈని ఘోరావ్‌చేసి డీఈపై పోలీస్ కేసును నమోదు చేశారు. సంఘటన జరిగి నాలుగు రోజులైనా ఎస్‌పిఎఫ్ సిబ్బందిపై చర్య లు తీసుకోవాలని ఎన్‌ఎస్‌పీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌పీఎఫ్ కమాండెంట్ మధు హైదరాబాద్ నుండి సాగర్‌కు చేరుకున్నారు. సాగర్ ఎస్‌ఈ రమేష్, ఈఈ విష్ణుప్రసాద్ ఉద్యోగులతో ధర్నాను విరమించాలని కోరగా, కానిస్టేబుల్స్‌ను బదిలీ చేసేవరకు ధర్నాను విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఎస్‌పీఎఫ్ కమాండెంట్ మధు రెండు రోజుల్లో ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియచేసి ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎస్‌ఎస్‌పీ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని విరమించి, విధులకు హాజరయ్యారు.