గుంటూరు

రాజధాని డిజైన్‌లు సరే... భూములిచ్చిన రైతుల సంగతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, మార్చి 27: రంగుల రాజధాని గురించి కళ్ళు మిరుమిట్లు గొలిపేట్లు డిజైన్‌లు ప్రదర్శిస్తున్న ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి సహకరించిన రైతుల విషయంలో స్పష్టత ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం తాడేపల్లి మేకా అమరారెడ్డ్భివన్‌లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కేవలం 900 ఎకరాల్లోనే అద్భుత రాజధాని నిర్మిస్తామని చెపుతున్న ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన వేలది ఎకరాల భూమిని ఏమి చేస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టించటానికి ప్రజలను నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నమూనాల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయటంలేదని, డ్వాక్రా రుణాల మాఫీ ఒక ప్రహసనంగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాద పోకడలు పెచ్చరిల్లుతున్నాయని, ఢిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు మతోన్మాద పోకడలను తెలియపరుస్తున్నాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాయంలోమొదటి నుండి అభ్యుదయ శక్తులు విద్యార్థులకు అండగా ఉండేవని, వారిని దెబ్బకొట్టడానికి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం సిపిఎం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాడేపల్లి మండలంలోప్రభుత్వం అనుమతిచ్చిన, ఇవ్వని ఇసుక క్వారీల్లో ఇప్పటి వరకూ జరిగిన అవినీతి, అక్రమాలు గురించి కూలంకుషంగా చర్చించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు జొన్న శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, వేముల దుర్గారావు, బూరగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.