గుంటూరు

పాపులను రక్షించేందుకు భువికి వచ్చిన ఏసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 27: క్రీస్తుప్రభువు మానవునిగా ఈ లోకంలో పునరుత్థానంతో మానవాళిని పాపమాల్యం నుంచి రక్షించారని కోల్ఫింగ్ యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ పామిశెట్టి బాలస్వామి పేర్కొన్నారు. క్రీస్తు పునరుత్థాన మహోత్సవంలో భాగంగా ఆదివారం స్థానిక ఎసి కళాశాల వద్దనున్న పునీత ఆగ్నేసమ్మ దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఫాదర్ బాలస్వామి వాక్యోపదేశం చేశారు. క్రీస్తు ఏ విధంగానైతే మరణాన్ని జయించారో అదేవిధంగా మానవులు కూడా ఆయనతో పాపంలో మరణించి జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు బోధనలతో కొత్త జీవితం పొందాలన్నారు. ఈ సందర్భంగా క్రీస్తుప్రభువును స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుడుచేసిన శుభకార్యాలను బట్టి ఆయన్ను స్తుతించారు. దేవాలయ ప్రాంగణం నుండి బయలుదేరిన భక్తులు స్తుతి గేయాలు చేసుకుంటూ సెయింట్ జోసఫ్ ఆసుపత్రి ప్రాంగణంమీదుగా మరలా బయటిద్వారం నుండి మెయిన్‌రోడ్డు మీదుగా దేవాలయ ప్రాంగణం వరకు తేరు ప్రదర్శన కొనసాగించారు. ప్రదర్శన అగ్రభాగంలో పునీత ఆగ్నేసమ్మ దేవాలయ విచారణ గురువు ఫాదర్ పిల్లి ఆంతోనీ, సహాయ విచారణ గురువు ఫాదర్ యేరువ రాజేష్, ప్యారీష్ కౌన్సిల్, యూత్, కతోలిక్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.