రాష్ట్రీయం

హెచ్‌సియు కేసు విచారణ 12కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో విద్యార్థుల సస్పెన్షన్‌పై దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టుకు హాజరైన తెలంగాణ హోంశాఖ తరఫు న్యాయవాది అదనపు సమాచారంతో కౌంటర్ దాఖలు చేసేందుకు అవసరమైన కొంత గడువు ఇవ్వాలని కోరారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు హెచ్‌సియు కూడా కోర్టుకు నివేదించింది. హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి తనకు రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన మరో పిటీషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం ఈ రెండు పిటీషన్లపై తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
భోగాపురం ఎయిర్‌పోర్టు భూ సేకరణపై హైకోర్టు స్టే
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల 12 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే విధించింది. ప్రభుత్వం భూ సేకరణ కోసం ఆయా గ్రామాల ప్రజలకు నోటీసులు జారీ చేసింది. రెండేళ్ల కిందట 5.315 ఎకరాల భూ సేకరణ అవసరమని భావించి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని గ్రామస్తులు కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను విచారించిన కోర్టు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.