రాష్ట్రీయం

హ్యాపీ హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా- భాజపాలను గెలిపిస్తే పూర్తిస్థాయిలో నగరంలో వైఫై ఏర్పాటు చేస్తామని, పైపు లైన్ల ద్వారా వంట గ్యాస్ అందిస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా సెట్ టాప్ బాక్స్ ఇస్తామని, పేదలకు ఉచిత నల్లా కనెక్షన్ కల్పిస్తామని, శివారు ప్రాంతాలకు వౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెదేపా -్భజపా సంయుక్త ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాయి. తెదేపా -్భజపాలు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు వంద వరాలు ప్రకటించాయి. మిత్రపక్షాలైన రెండు పార్టీల విజన్ డాక్యుమెంట్ ఫర్ హ్యాపీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మ్యానిఫెస్టో-2016ను బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విడుదల చేశారు. కార్యక్రమంలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పార్టీ నాయకుడు మల్లారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ షెహర్ హమారా నినాదంతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో వంద వరాలు కురిపించారు.
విశ్వనగరంగా హైదరాబాద్
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ టిడిపి-బిజెపిలను గెలిపిస్తే గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టలేదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల8 గదుల ఇళ్ళ నిర్మాణంలో ప్రతి ఇంటికీ రెండున్నర లక్షలు కేంద్రం అందిస్తున్నదని ఆయన చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు 800 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో దశకు నిధులు తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
హామీల్లో మచ్చుకు కొన్ని..
ప్రతి ఇంటికీ మంచి నీటి సరఫరా, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్, ప్రతి ఇంటికీ సెట్‌టాప్ బాక్స్ ఉచితంగా ఇస్తామన, 50 చౌరస్తాల్లో ఫ్లైవోవర్లు నిర్మించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని, మహిళలను వేధించే అకతాయిలను, బంగారు గొలుసు దొంగలను అరికడతామని, రైతు బజార్లలో దళారుల వ్యవస్థను లేకుండా చేసి వినియోగదారుల, రైతుల ప్రయోజనాలు కాపాడుతాం, ప్రతి డివిజన్‌లో మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి, ఉచితంగా మందుల పంపిణీ చేస్తాం, అన్ని ముఖ్యమైన చౌరస్తాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో చేపడతాం, ప్రతి పేదవారికి పక్కా గృహ నిర్మాణం, డ్వాక్రా గ్రూపులకు రుణాలు, స్వచ్చ భారత్ నిధులతో మురికివాడల అభివృద్ధి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మీరాలం ట్యాంకుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం, జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి, ట్రేడ్ లైసెన్సుల మంజూరు సరళతరం, భవన నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు తదితరుల సంక్షేమ కోసం కృషి, ఉచిత బీమా, కేంద్రం సహకారంతో హైదరాబాద్‌కు అవసరమయ్యే 600 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం నిర్మాణం, ఐటిఐఆర్ పరిథి విస్తరణ, శివారు ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తాం, ప్రతి డివిజన్‌లో మహిళా, శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, కులీకుతుబ్‌షా డెవలప్‌మెంట్ అథారిటీని ఆర్థికంగా పరిపుష్టం చేస్తాం, ఆస్తి పన్ను తగ్గించి, హేతుబద్దీకరణ, సెల్ఫ్ అసెస్‌మెంట్ పథకాన్ని పటిష్టపరుస్తాం, నెల రోజుల్లో నల్లా కనెక్షన్లను ఇస్తాం, గ్రేటర్ పరిథిలో 200 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పటు చేస్తాం, 200 గజాలలోపు స్థలాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఉండాలన్న నిబంధనలు రద్దు చేస్తామని ఇలా వంద వరాలను రెండు పార్టీలు కురిపించాయి.