తెలంగాణ

ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి జరిగింది. టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి లాకవర్తు సునీత కోసం ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే హరిప్రియ వచ్చారు. కామేపల్లి మండలం గోవింద్రాలలో ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. తాము కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే టీఆర్‌ఎస్‌లో చేరటం ఏమిటని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా హరిప్రియ తన ప్రచారాన్ని ముగించుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.