తెలంగాణ

మార్కెటింగ్‌ శాఖలో కొత్త పద్ధతులు : హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులను మార్కెటింగ్‌ శాఖలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సింగిల్‌ లెవీ, సింగిల్‌ లైసెన్స్‌ విధానాలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు .పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేట్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంగణంలో జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (నామ్‌) అమలుపై బుధవారం జరిగిన వర్క్‌షాప్‌కు మంత్రి హాజరయ్యారు. రైతులకు గిట్టుబాటు ధరల కల్పనే లక్ష్యంగా మార్కెటింగ్‌ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని అన్నారు. మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ శరత్‌, ఆస్కీ ఛైర్మన్‌ పద్మనాభయ్య, 10 జిల్లాల మార్కెటింగ్‌ శాఖాధికారులు పాల్గొన్నారు.