తెలంగాణ

హెచ్‌సియులో సడలని ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండడంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. వర్సిటీలో అన్ని గేట్లను మూసివేసి, విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించకుండా పోలీసులు మోహరించారు. జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ ఈరోజు హెచ్‌సియులో జరిగే సభలో పాల్గొంటారని ప్రచారం జరగడంతో వర్సిటీ అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ సంస్మరణార్థం సభ జరిపేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో రోహిత్ తల్లి, కన్నయ్య పాల్గొనాల్సి ఉంది. బహిరంగ సభకు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వచ్చిన సిపిఐ నేత అజీజ్ పాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్సిటీలోకి కన్నయ్య ప్రవేశించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.