తెలంగాణ

హెచ్‌సియులో మెస్‌లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. పదిహాస్టళ్లకు సంబంధించిన మెస్‌లను తిరిగి ప్రారంభించారు. క్యాంపస్ వద్ద పోలీసు బందోబస్తును యథాప్రకారం కొనసాగిస్తున్నారు. వీసీ చాంబర్‌పై దాడికి సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన 27 మంది విద్యార్థులను మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకి తరలించారు. క్యాంపస్‌లో నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నాట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.