ఆంధ్రప్రదేశ్‌

మరో మూడు రోజులు ఉక్కబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, ఆకాశంలో మేఘాలు ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దక్షిణ కోస్తాలో సాధారణకంటే 3 నుంచి 5, రాయలసీమలో 3 నుంచి 4, ఉత్తర కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కబోతతో కోస్తా జిల్లాల ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలోనూ ఈ ప్రభావం కనిపించింది. సముద్రం నుంచి సరైన గాలులు రాకపోవడం, ఆపై గాలిలో తేమ శాతం పెరగడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరో రెండు, మూడు రోజులపాటు దాదాపు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాలో ఈ నెల 25 సాయంత్రం నుంచే వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం పశ్చిమ దిశగా ముందుకు కదిలితే, కోస్తాలో వర్షాలు కురవొచ్చని భావిస్తున్నారు.