రాష్ట్రీయం

కల్తీ మద్యం మరణాలపై సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సిఎం చంద్రబాబు ఆదేశం
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
బాధితులకు ముఖ్యమంత్రి పరామర్శ
విజయవాడ, డిసెంబర్ 7: కల్తీ మద్యం తాగి ఐదుగురు మరణించటం, 28 మంది అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనను ముగించుకుని సోమవారం రాత్రి నగరానికి చేరుకున్న వెంటనే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి ఆయన పరామర్శించారు. సంఘటనకు దారితీసిన కారణాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పన ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ బాధితులకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైనా, ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఏమైనా లోపాలుంటే గుర్తించి అందుకు బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. అధికార యంత్రాంగం తక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, లేనిపక్షంలో వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. అసలు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటివి జరగవన్నారు. బాధితులందరూ కాయకష్టం చేసుకునే బడుగుజీవులని, కొందరు రోజుల తరబడి లారీలపై తిరిగి వచ్చినవారు, వారంతపు సొమ్ము చేతికి అందినవారు, పడిన కష్టాన్ని మరచిపోవటానికి మరికొందరు అలవాటుగా మద్యం తాగారని ఆయనన్నారు. రోజూ తాగే బ్రాండ్ అయినా తాగిన వెంటనే వాంతులతో కొందరు రోడ్డుపైనే పడిపోగా మరికొందరు ఇంట్లో కుప్పకూలారన్నారు. అత్యధికులు అక్కడి నీరు తాగారని, అక్కడి నీరు తాగనివారు కూడా అస్వస్థతకు గురైనందున మద్యం శాంపిల్స్‌ను నిశితంగా పరీక్షిస్తామన్నారు. బారు దగ్గరే పడిపోయినప్పటికీ యజమానులు చోద్యం చూశారేతప్ప ఆసుపత్రికి తరలించలేదన్నారు. పార్కింగ్ సెల్లారులో బార్ కొనసాగుతున్నా కార్పొరేషన్ పట్టించుకోక పోవటంపై విచారణ జరిపిస్తామన్నారు. గతంలో ఇదే బార్‌లో ఇద్దరు మరణించిన విషయం ఇప్పుడే మీడియా ద్వారా తెలుస్తోందని, దీనిపై కూడా విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన వెంట మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, ఉన్నతాధికారులు ఉన్నారు.