రాష్ట్రీయం

మళ్లీ మావోల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తలెత్తిన వామపక్ష తీవ్రవాద సమస్యకు చెక్ పెట్టేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల డిజిపిలు త్వరలో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఆరుగురు టిఆర్‌ఎస్ నేతలను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతాలు చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉంటాయి. ప్రస్తుతం అక్కడ కూడా ఏపిఎస్‌పి బెటాలియన్ బలగాలు, గ్రేహౌండ్స్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. గత నెలలో ఆంధ్రాలో విశాఖపట్నం ఏజన్సీలో టిడిపి చెందిన గిరిజన నేతలను మావోయిస్టు పార్టీ నక్సలైట్లు కిడ్నాప్ చేసి అనేక రోజుల తర్వాత వదిలిపెట్టారు. సెప్టెంబర్ నెలలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వద్ద అడవుల్లో శ్రుతి, విద్యాసాగర్ రెడ్డి అనే మావోయిస్టు పార్టీ కార్యకర్తలు పోలీసు ఎన్‌కౌంటర్లో మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో వీరు మృతి చెందలేదని, పోలీసులు పట్టుకెళ్లి కాల్చి చంపారని మావోయిస్టు పార్టీతోపాటు సానుభూతిపరుల సంస్ధలు ఆరోపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకే పోలీసు వ్యవస్ధ, నిఘా, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబి ఉండడం వల్ల సమన్వయంతో గత ఐదేరేళ్లుగా నక్సలైట్ల సమస్యను పూర్తిగా నిర్మూలించారు. కాని రాష్ట్ర విభజన తర్వాత అటు ఆంధ్రాలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో, తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్లు తమ కార్యకలాపాలను మళ్లీ మొదలు పెట్టారు.
డిసెంబర్ 2వ తేదీ నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఆంధ్ర, తెలంగాణలో తమకు పట్టున్న ప్రాంతాల్లో నిర్వహించేందుకు మావోయిస్టు పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ వారోత్సవాల్లో గిరిజన యువత, సానుభూతిపరులు పాల్గొనకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో దేశంలో మావోయిస్టు పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశాలు జరిగేవి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు అధికారులు పాల్గొనేవారు. గత ఐదారేళ్లుగా నక్సలైట్ల కార్యకలాపాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో నక్సలైట్ల కార్యకలాపాలపై పోలీసుల నిఘా తగ్గుముఖం పట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలో సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా, చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్టప్రోలీసు అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేసేందుకు విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు తెలంగాణపోలీసు శాఖకు చెందిన ఉన్నత పోలీసు అధికారి ఒకరు చెప్పారు.