తెలంగాణ

కూలిన చెట్లు... ఆగిన విద్యుత్! రాజధానిలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో మరోసారి శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. క్యుములోనింబస్ మేఘాలు మరోసారి తమ ప్రతాపం చూపడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, రెడ్‌హిల్స్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, లోయర్ ట్యాంక్‌బండ్‌తో పాటు ఇందిరాపార్కు సహా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయ. దీంతో మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర భవన్ సమీపంలో బలమైన గాలులతో ఓ చెట్టు విరిగిపడటంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. సుమారు గంటన్నర సేపు కురిసిన భారీ వర్షానికి నగరంలో నిత్యం రద్దీగా ఉండే బేగంపేట, రాణిగంజ్, ఖైరతాబాద్, కెపిసి జంక్షన్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, ఎం.జె.మార్కెట్ ప్రాంతాల్లో గంటల తరబడి ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ట్యాంక్‌బండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు వైస్రాయ్ హోటల్, అటు అంబేద్కర్ విగ్రహం వరకు వాహనాలు క్యూ కట్టాయి. ఇక శివార్లలో సాయంత్రం ఏడు గంటల నుంచి ఉప్పల్, హయత్‌నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఉప్పల్, హయత్‌నగర్, హబ్సిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షానికి బలమైన గాలులు కూడా తోడవ్వటంతో ఒక రకంగా వర్షం భీభత్సం సృష్టించింది. ఈ ప్రాంతాల్లోని కొన్ని పూరి గుడిసెల పైకప్పులు బలమైన గాలులకు ఎరిగిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.