రాష్ట్రీయం

తెలంగాణ సిఎం అధికార నివాస భవనం నేడు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గురువారం ప్రారంభం కానుంది. తెల్లవారు జామున ఉదయం 5:22 గంటలకు శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దంపతులు గృహ ప్రవేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయంలోని రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సిఎం నివాసం, సిఎం కార్యాలయం, సమావేశ మందిర సముదాయానికి ‘ప్రగతి భవన్’గా ప్రభుత్వం నామకరణం చేసింది. వివిధ వర్గాలతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి ‘జనహిత’గా నామకరణం చేసింది. ఇందులో ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై వివిధ వర్గాలతో ముఖ్యమంత్రి ఇక నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన క్యాంపు కార్యాలయ గృహ ప్రవేశంలో భాగంగా దేవ ప్రవేశం, యతి ప్రవేశం, గోవు ప్రవేశం తదితర పూజలు శాస్త్రోక్తంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్ దంపతులు, చిన జీయర్‌స్వామి పాల్గొంటారని పేర్కొన్నారు.
chitram...
ప్రారంభానికి సిద్ధమైన తెలంగాణ సిఎం కెసిఆర్ అధికార నివాస భవనం