తెలంగాణ

మందులపేరుతో మాదక ద్రవ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సాటి వ్యక్తికి సహాయం చేయబోయిన పాతబస్తీ యువకుడు హబీబ్ మహమ్మద్ దుబాయ్‌లో జైలుపాలైన ఉదంతమిది. వివరాల్లోకి వెళ్లే.. హబీబ్ ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తి తమ బంధువులకు కీళ్లనొప్పుల మందులు తీసుకెళ్లాలంటూ ఒక పెట్టెను ఆయనకు ఇచ్చాడు. తీరా హబీబ్ దుబాయిలో దిగగానే ఆ పెట్టెను పరిశీలించిన అధికారులు అందులో నిషేధిత మందులు ఉన్నట్లు గుర్తించారు. తనకేపాపం తెలీదని హబీబ్ ఎంత బ్రతిమిలాడినా వినకుండా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన జరిగిన ఈ ఘటనపై బాధిత కుటుంబం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఆశ్రయంచడం తో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతబస్తీ సర్కీపూల్‌బాగ్‌లో నివాసముంటున్న హబీబ్‌కు దుబాయ్‌లోని ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో అతని ఉద్యోగం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లేందుకు హబీబ్ గత ఏడాది అక్టోబర్ 28న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆయనకు వీడ్కోలు తెలిపే సమయంలో అక్కడికి వచ్చిన అల్ ఇద్రుస్ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉంటున్న తన బంధువు కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడని నమ్మబలికి లైరికా 150 ఎంజి అనే మాత్రలున్న పెట్టెను తీసుకెళ్లాలని కోరాడు. దీంతో సరేనని ఆ పెట్టెను తీసుకెళ్లిన హబీబ్ దుబాయ్ విమానాశ్రయంలో దిగగానే అక్కడి అధికారులు తనిఖీ చేశారు. లైరికా మాత్రలను దుబాయ్‌లో మాదకద్రవ్యాలతో సమానంగా పరిగణిస్తుండటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హబీబ్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ సమాచారాన్ని ఆయన తన తండ్రి తాహెర్, సోదరుడు ఖదీర్‌లకు తెలియజేశారు. దీంతో హబీబ్‌కు మానవతా దృక్పథంతో సాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులను సంప్రదించగా, తామేమీ చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆ తర్వాత మూడు నెలలపాటు వివిధ ప్రయత్నాలు చేసి విఫలమైన హబీబ్ కుటుంబ సభ్యులు చివరికి సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణతో పాటు ఎంబిటి నేత అమ్జదుల్లాఖాన్‌ను సంప్రదించారు. దీంతో హబీబ్ వివరాలను ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు పంపి అతనికి సాయం చేయాలని అభ్యర్థించినట్టు అమ్జదుల్లాఖాన్ తెలిపారు.