ఆంధ్రప్రదేశ్‌

దేవినేని నెహ్రూ హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విజయవాడ, ఏప్రిల్ 17: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. నెహ్రూకు భార్య, కుమారుడు అవినాష్, కుమార్తె క్రాంతి ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నెహ్రూను కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం మూడు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా తిరిగి అనారోగ్యానికి గురికావడంతో ఆదివారం మళ్లీ కేర్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఉదయం 5.20 గంటలకు గుండెపోటు రావడంతో మరణించారు. నెహ్రూ అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి.
విజయవాడలో 1954 జూన్ 22న జన్మించిన నెహ్రూ ఎన్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదివారు. 1970 ప్రాంతంలో విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా యుఎస్‌వో సంస్థను ప్రారంభించారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 83 ఎన్నికల్లో కంకిపాడు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుండి ఓటమి అనేది లేకుండా వరుసగా నాలుగు దఫాలు అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. తొలిసారిగా ఎన్టీఆర్ మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖను చేపట్టారు. నెహ్రూ శాసనసభకు ఎనిమిది సార్లు పోటీచేసి మూడుసార్లు ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఓసారి చిరకాల ప్రత్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలోను, రెండోసారి నాగేశ్వరరావు తనయుడు రవి చేతిలోను, మూడోసారి గద్దె రామ్మోహన్ చేతిలోను ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి గద్దె రామ్మోహన్‌పై 27,525 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆపై 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడి గత సెప్టెంబర్ 16న చంద్రబాబు సమక్షంలో తిరిగి తెలుగుదేశంలో చేరారు.
నెహ్రూ మరణ వార్త తెలియగానే విజయవాడ నుంచి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, నెహ్రూ అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. మధ్యాహ్నం నెహ్రూ భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో విజయవాడలోని గుణదలలో ఆయన స్వగృహానికి తరలించారు.
తమ ప్రియతమ నేత కడసారి చూపు కోసం నగరం నలుమూలల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి రాజకీయ, కుల, మతాలకు అతీతంగా ప్రజలు అర్ధరాత్రి వరకు నెహ్రూ స్వగృహానికి తరలివస్తూనే ఉన్నారు. సంతాప సూచకంగా గుణదల పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేశారు. నగరంలో పలుచోట్ల ప్రత్యేకంగా షామియానాలు వేసి అందులో నెహ్రూ చిత్రపటాలు ఉంచి నివాళి అర్పించారు.
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు నెహ్రూ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నెహ్రూ మరణం తెలుగు దేశం పార్టీకి తీరని లోటని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసన సభాపతి కోడెల, ఎంపిలు కేశినేని శ్రీనివాస్, కొనకళ్ల నారాయణ, రాయపాటి సాంబశివరావు, మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వివిధ పార్టీల నేతలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నెహ్రూ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

chitram...

దేవినేని రాజశేఖర (నెహ్రూ) మృతదేహం, నెహ్రూ పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు