కృష్ణ

మొబైల్ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 18: జిల్లాలో మొబైల్ స్కాన్ సేవల నిర్వహణకు ఎవరికీ అనుమతులు లేవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వై కామేశ్వర ప్రసాద్ తెలిపారు. ఎవరైనా మొబైల్ స్కానింగ్ సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మంగళవారం తన ఛాంబర్‌లో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 287 స్కాన్ సెంటర్లు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వచ్చిన 26 దరఖాస్తులపై విచారణ నిర్వహించినట్లు తెలిపారు. ఇవి కాకుండా మరో తొమ్మిది దరఖాస్తులు సరిగ్గా లేకపోవటంతో తిరస్కరించామన్నారు. ప్రతి దరఖాస్తును జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ, అడ్వైజరీ కమిటీ, కలెక్టర్, జిల్లా న్యాయాధికారి అనుమతి తీసుకుని రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేస్తామన్నారు. ఈ సమావేశంలో డా. టివిఎస్‌ఎన్ శాస్ర్తీ, డా. పి లక్ష్మీబాల, డా. పి రత్నావళి, డా. వై సుబ్రహ్మణ్యం, డా. పిజె అమృతం, డా. వి సీతమ్మ, డా. వి శోభ, డా. చాముండేశ్వరి కుమారి, కె జోనాతన్ తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యపై చైర్మన్ పర్యటన
జగ్గయ్యపేట, ఏప్రిల్ 18: పట్టణంలోని 18వ వార్డు నాగమయ్య బజారులో మంచినీరు రావటంలేదని వస్తున్న ఫిర్యాదులపై చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మంగళవారం వార్డులో పర్యటించారు. వేసవి కారణంగా మంచినీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని నూతనంగా పైప్‌లైన్‌ల నిర్మాణం కోసం ప్రకృతి వైపరీత్యా నిధులు రూ. 42 లక్షలు మంజూరయ్యారని, వీటిలో రూ. 4 లక్షలు పైప్‌లైన్ నిర్మాణాలకు కేటాయించి వార్డులో నీటి సమస్య పరిష్కరిస్తామని అన్నారు. నీటిని వృధా చేయరాదని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా డెల్టా ఆధునీకరణ పనులు
అవనిగడ్డ, ఏప్రిల్ 18: మండల పరిధిలో నిర్వహిస్తున్న డెల్టా ఆధునీకరణ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ లేదని అవనిగడ్డ నియోజకవర్గ వైసిపి కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు అన్నారు. మండల పరిధిలో డెల్టా ఆధునీకరణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అవుట్‌ఫాల్ స్లూయిస్ నిర్మాణంలో, రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అండర్ టెన్నల్స్ నిర్మాణం జరపకుండా రూ.6కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం మాత్రమే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాము అనేకమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే అండర్ టెన్నల్ నిర్మాణాలు చేపట్టక అనవసర నిర్మాణాలు నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారని ఆరోపించారు. విరిగి పోయిన రహదారి రిటైనింగ్ వాల్‌కు మధ్య ఖాళీని ఇసుకతో నింపాల్సి ఉండగా మట్టితో నింపటాన్ని తాము గుర్తించామన్నారు. ఈ అక్రమాలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని కోరుతున్నారు.
పంట కాలువలోకి ఆక్వా ఫ్యాక్టరీ నుంచి కలుషిత నీరు
కృత్తివెన్ను, ఏప్రిల్ 18: మంచినీరు, సాగునీటి అవసరాలకు ఉపయోగించే పంట కాలువలోకి ఆక్వా ఫ్యాక్టరీ నుండి వెలువడే కలుషిత జలాలను యాజమాన్యం విడుదల చేశారంటూ మునిపెడ నీటి సంఘం అధ్యక్షుడు దాసరి ఆదినారాయణ, సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జలవనరుల శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో జలవనరుల శాఖ ఎఇ సూర్యభరత్, నీటి సంఘం సభ్యులు మునిపెడ పంచాయతీ పరిధిలోని కిలుషిత నీరు విడుదల చేసిన పంట కాలువను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఇ సూర్యభరత్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుండి వెలువడే కలుషిత నీరు పంట కాలువలోకి రావడం వాస్తవమేనన్నారు. దీనిపై ఆక్వా ఫ్యాక్టరీకి నోటీసులు ఇస్తామని, ఉన్నతాధికారులకు నివేదిక అందించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఎన్ని సార్లు చెప్పినా యాజమాన్యం స్పందించటం లేదని మునిపెడ నీటి సంఘం అధ్యక్షుడు దాసరి ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పంట పొలాల మధ్యలో ఆక్వా ఫ్యాక్టరీకి అనుమతులు ఎలా మంజూరు చేశారన్నారు. తక్షణమే మా గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటూ ఎఇ భరత్‌రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో మునిపెడ గ్రామస్థులు పాల్గొన్నారు.