కృష్ణ

ప్రకృతి, రమణీయతకు మారుపేరు ‘దివిసీమ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఏప్రిల్ 25: ప్రేక్షకుల మనోభావాలకు తగిన విధంగా తాను తీసే చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. స్థానిక గాంధీ క్షేత్రంలో తన జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి బోయపాటి మాట్లాడుతూ దివిసీమ ప్రకృతి రమణీయతకు మారుపేరని, సముద్ర సాగర సంగమ ప్రాంతం చారిత్రక ప్రసిద్ధి పొందిన హంసలదీవిలో తాను తీస్తున్న చిత్రంలో రమణీయమైన దృశ్యాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయనడంలో సందేహం లేదన్నారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం చిత్రీకరణతో దివిసీమ కోనసీమలాగా చిత్రీకరణకు అనువైన ప్రదేశంగా ఖ్యాతికెక్కుతుందన్నారు. త్వరలో ఈ చిత్రానికి పెరు వెల్లడిస్తామని, తనకు సహకరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీను అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నిర్మాత రవీంద్రరెడ్డి, స్థానిక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

డ్రాపౌట్స్ లేకుండా చూడాలి
నాగాయలంక, ఏప్రిల్ 25: కోడూరు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఏపి ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనఊరు-మనబడి కార్యక్రమంలో ఆయా గ్రామాలలోని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులందరూ విధిగా పాల్గొనే విధంగా కృషిచేయాలని మండల విద్యాశాఖాధికారి తుంగల విజయమారుతీ రామదాసు కోరారు. మంగళవారం ఎంఆర్‌సి భవనంలో నిర్వహించిన హెచ్‌ఎంల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న 26 ప్రయోజనాలను ప్రజలకు తెలపాలని సూచించారు. మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పాఠశాలలు తెరిచే వరకు కొనసాగించాలని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుటకు అవసరమైన ప్రవేశ పత్రాలను వారివారి ఇళ్ల వద్దనే అందచేసి ఆమోదం పొందాలన్నారు. ఇప్పటి వరకు 43 అడ్మిషన్లు వచ్చినట్లు ఎంఇఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్ కోట సంపత్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు, సిఆర్‌పిలు పాల్గొన్నారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటాం
* జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 25: జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటామని చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన పంచాయతీ రాజ్ దివస్ కార్యక్రమం సందర్భంగా 2016 జూన్ నుండి 2017 మార్చి నెలల మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. జెడ్పీ మినిస్టీరియల్, క్లాస్-4 ఎంప్లాయిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో 27 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అలాగే పంచాయతీ రాజ్‌లో ఉత్తమ సేవలు అందించిన 14 మంది అధికారులు, ఉద్యోగులను ఆమె సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన పదవీ విరమణ చేసిన ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వస్తే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వారి సేవలను వినియోగించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, డెప్యూటీ సిఇఓ కృష్ణమోహన్, పిఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సహాధ్యక్షుడు ప్రసాదరావు, జెడ్పీ యూనిట్ అధ్యక్షుడు లక్ష్మీ శ్రీనివాస్, క్లాస్-4 ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో నలుగురు ఎస్‌ఐలకు సిఐలుగా పదోన్నతి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 25: జిల్లాలో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏలూరు రేంజ్ డిఐజి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఇంటిల్‌జెన్సీ ఎస్‌ఐగా పనిచేస్తున్న పి శ్రీనివాసరావు, నూజివీడు రూరల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న నాగప్రసాద్, విఆర్‌లో ఉన్న ఉమామహేశ్వరరావు, మోర్ల వెంకట నారాయణలకు సిఐలుగా పదోన్నతి లభించింది. వీరితో 2016లో పదవీ విరమణ చేసిన జెఎన్ మల్లేశ్వరరావు, ఎన్ వెంకటేశ్వరరావులకు కూడా పదోన్నతి లభించింది. అయితే వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రమే అందనున్నాయి.

భద్రిరాజుపాం పిఎసిఎస్ కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్
* అధ్యక్షుడితో సహా సీఈవో, క్యాషియర్‌పై కేసులు నమోదు
* పిఎసిఎస్‌లో విచారణ చేపట్టిన ఎస్‌ఐ ప్రసాద్

తోట్లవల్లూరు, ఏప్రిల్ 25: పీకల్లతు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన మండలంలోని భద్రిరాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరమితి సంఘం అధ్యక్షుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), క్యాషియర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మంగళవారం విచారణ ప్రారంభించారు. ఎస్‌ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరరావు, ఇద్దరు కానిస్టేబుళ్లు పిఎసిఎస్‌లో విచారణ నిర్వహించారు. సీఈవో ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, క్యాషియర్ కె బంగారయ్య కలిసి రూ.57 లక్షల అవినీతికి పాల్పడగా, అందులో రూ.30.50లక్షలు తోట్లవల్లూరు కెడిసిసి బ్యాంకును మోసగించారని అధ్యక్షుడు చాగంటి శివశంకరరెడ్డి ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ చెప్పారు. అలాగే నిధులు దుర్వినియోగం చేసినందుకు అధ్యక్షుడు శివశంకరరెడ్డి, సీఈవో వెంకటేశ్వరరెడ్డి, క్యాషియర్ బంగారయ్యలపై కేసు నమోదు చేయమని డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ రమణారెడ్డి ఫిర్యాదు చేశారని, దీంతో ముగ్గురిపైన ఐపిసి 408,409,468,477, రెడ్‌విత్ 34 సెక్షన్‌ల కింద ఈ నెల 20వ తేదిన కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. అసిస్టెంట్ కో ఆపరేటీవ్ రిజిస్ట్రార్, విచారణాధికారి శివశంకరరెడ్డి నుంచి, పిఎసిఎస్ సిబ్బంది నుంచి పోలీసుల మంగళవారం వివరాలు సేకరించారు. రూ.30.50 లక్షలను సీఈవో, క్యాషియర్ పలు సందర్భాల్లో కెడిసిసి నుంచి 22.50 లక్షలు డ్రాచేసుకు వచ్చి పిఎసిఎస్‌లో అప్పగించకపోవటం, అలాగే పిఎసిఎస్ నుంచి రూ.8 లక్షలు తీసుకువెళ్ళి కెడిసిసి బ్యాంకులో జమచేయకుండా చేసినట్టు చూపగా, వీరు జరిపిన లావాదేవీలను పరిశీలించకుండా సంతకాలు చేయటంతో అధ్యక్షుడు చాగంటి శివశంరకరెడ్డిపై కూడా కో ఆపరేటీవ్ ఆఫీసర్ కేసు నమోదుకు ఆదేశాలిచ్చారని చెపుతున్నారు. సీఈవో, క్యాషియర్‌ల నుంచి అధ్యక్షుడు శివశంకరరెడ్డికి ఏమైనా సొమ్ములు ముట్టాయా లేదా అని విచారణ చేస్తున్నారు. రూ.57లక్షల్లో రూ30.50 లక్షలు కెడిసిసిని మోసగించగా మిగతా రూ.26.50 లక్షలు పిఎసిఎస్‌లో సేవింగ్ ఖాతాదారులు, రైతుమిత్ర గ్రూపులు, స్వయం సహాయ సంఘాలు, ఫిక్స్‌డ్ డిపాజిటర్లను మోసగించి అవినీతికి పాల్పడ్డారని, దీనికి సంబందించి కొంత సమాచారం సేకరిస్తున్నట్టు విచారణాధికారి శివశంకరరెడ్డి తెలిపారు.

ఇద్దరు యువతుల అదృశ్యంపై ఫిర్యాదు
పెనమలూరు టౌన్, ఏప్రిల్ 25: వేర్వేరు చోట్ల ఇద్దరు యువతులు అదృశ్యమైనట్లు పెనమలూరు పోలీసులకు మంగళవారం ఫిర్యాదులు అందాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన ఒక మహిళ, విజయవాడ క్రీస్తురాజపురంలోబందువుల ఇంట్లో ఉంటూ ఈ నెల 23న జరిగిన ఎఈ పోస్టు పరీక్ష రాసేందుకు సిద్దార్థ ఇం