రాష్ట్రీయం

పంపకాలకిదీ లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: విభజన చట్టంలో తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల ఆస్తుల పంపకాలపై కేంద్ర హోంశాఖ స్పష్టతనిచ్చింది. రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను పంపినట్టు తెలిసింది. హెడ్ క్వార్టర్ నిర్వచనంపై రెండు రాష్ట్రాలు భిన్నవాదనలు వినిపించాయి. జనాభా ప్రాతిపదికన హెడ్ క్వార్టర్ ఆస్తులు పంచుకోవలసి ఉంది. తెలంగాణకు 42శాతం, ఆంధ్రకు 58శాతం ఆస్తులు కేటాయించాలని విభజన చట్టంలో ఉంది. తొమ్మిదో షెడ్యూల్‌లోని కొన్ని సంస్థలకు ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఆస్తులు ఉన్నాయి. ఇవి హెడ్ క్వార్టర్ పరిధిలోకే వస్తాయి. వీటిని సైతం జనాభాప్రాతిపదికన పంచాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. హెడ్ క్వార్టర్ అంటే కేవలం ప్రధాన కార్యాలయం మాత్రమే అవుతుందని తెలంగాణ సర్కార్ వాదన. స్పష్టత కోసం ఇరు రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించారు. ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ అధికారికంగా ఇరు రాష్ట్రాలకు స్పష్టత ఇచ్చింది. ఆర్‌టిసి, విజయడైరీ, ఆంధ్ర ఫుడ్, ఆగ్రోస్‌వంటి పలు సంస్థలు తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్నాయి. ఆర్‌టిసి ప్రధాన కార్యాలయం బస్ భవన్. ఆర్టీసికి బస్ భవన్‌తో పాటు నగరంలో ఆస్పత్రి, బాడీ బిల్డింగ్ యూనిట్, వివిధ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిని ప్రధాన కార్యాలయంగానే భావించాలని ఆంధ్రప్రదేశ్ వాదించింది. అయితే ప్రధాన కార్యాలయం ఉన్న బస్ భవన్ మాత్రమే ప్రధాన కార్యాలయంగా భావించి 42:58 శాతం చొప్పున పంపకాలు జరపాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆదే విధంగా విజయడెయిరీకి వివిధ ప్రాంతాల్లో యూనిట్స్ ఉన్నాయి. లాలాపేటలోని యూనిట్‌కు అనంతపురం నుంచి పాల సరఫరా జరిగేది. అనంతపురం నుంచి పాలసరఫరా జరిగే లాలాపేట యూనిట్‌ను కూడా ప్రధాన కార్యాలయంగా భావించి 58శాతం వాటా ఇవ్వాలి అని ఆంధ్ర వాదించింది. వివాదం రాజుకోవడంతో లాలాపేట యూనిట్‌కు అనంతపురం నుంచి పాల సరఫరాను నిలిపివేశారు. ప్రధాన కార్యాలయంలో మాత్రమే వాటా ఉంటుందని, లాలాపేట యూనిట్‌లో ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఎపి ఆగ్రోస్‌తో పాటు కొన్ని సంస్థలకు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలతో పాటు గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి, వీటిలోనూ వాటా రావాలని ఆంధ్రప్రదేశ్ చేసిన వాదన వీగిపోయింది. తొమ్మిదవ షెడ్యూల్‌లో ఉన్న అన్ని సంస్థల ప్రధాన కార్యాలయాల్లో మాత్రమే ఆంధ్రకు వాటా ఉంటుందని, వాటికి అనుబంధంగా ఉన్న యూనిట్లలో వాటా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.