ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ దిగితే ఆధారాలిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘిస్తూ రాజధాని అమరావతి సమచారాన్ని సిఎం చంద్రబాబే మంత్రులకు లీక్ చేశారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరలేపారని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభియోగాలు మోపారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు అమరావతి చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేసిన విషయాలు తమ వద్ద ఆధారాలతో ఉన్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణకు సిబిఐని రంగంలోకి దించితే ఆధారాలు అందిస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ అమరావతి రాజధాని విషయంలో తన పార్టీవారికి ప్రయోజనం జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికార పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు, ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘించారన్నారు. పాలనలో నిష్పక్షపాతంగా ఉండాలన్న నియమాన్ని కాలరాచారన్నారు. భూముల కొనుగోళ్లలో చంద్రబాబే పెద్ద దోషి అన్నారు. తన ఆస్తులపై విచారణ జరపకుండా స్టే తెచ్చుకున్న ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనపై చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసి కేసులు పెట్టారన్నారు. ఫలానాచోట రాజధాని వస్తుందని ముందే తన బినామీలకు చెప్పి చంద్రబాబు భూములు కొనుగోలు చేయించి, ఆ భూమలు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారన్నారు. తానుచేసిన అభియోగాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.