క్రైమ్/లీగల్

ప్రాణం మింగేసిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువకుడి మృతి
కేపీహెచ్‌బీకాలనీ, మే 6: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వివేకానందనగర్‌కు చెందిన రఘురామయ్య (36) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని బైక్ (టి ఎస్ 07 ఈ ఎన్ 8096) పై ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి ఆర్టిసీ బస్సు (టీ ఎస్ 07 యుబి 6736) వేగంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
శేరిలింగంపల్లి, మే 6: భర్త వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ఒకే సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తుండడం గమనార్హం. ఈ సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందానగర్‌లోని అపర్ణ గార్డేనియా అపార్టుమెంట్ ఫ్లాట్ నెంబర్ ఏ 801లో నివసిస్తున్న గంజి రేఖ (30), భర్త ఉజ్వల్ గచ్చిబౌలిలోని ఐబీఎమ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 2008 సంవత్సరంలో వివాహమైన వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్త వేధింపులు తీవ్రం కావడంతో మనస్తాపానికి గురైన రేఖ రాత్రి ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవ పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చందానగర్ ఇన్స్‌పెక్టర్ ఎన్.తిరుపతి రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ భాస్కర్ దర్యాప్తు చేస్తున్నారు.