బిజినెస్

హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఓ నూతన క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేగాక భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ భారత సంతతి సాఫ్ట్‌వేర్ దిగ్గజం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వ్యాపారాభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన సుందర్ పిచాయ్.. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ సిఇఒగా నియమితులైన తర్వాత భారత్‌లో సుందర్ పిచాయ్ తొలి పర్యటన ఇదే. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా పిచాయ్ కలవనున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోనూ సమావేశమవుతారు. కాగా, బుధవారం ఇక్కడ నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో పిచాయ్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికల్లా దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేలా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. భారతీయ రైల్వే టెలికాం విభాగమైన రైల్‌టెల్‌తో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా డిసెంబర్ 2016 నాటికి 100 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 400 స్టేషన్లకు వైఫై సౌకర్యాన్ని అందించేలా గూగుల్ ఇండియాతో రైల్‌టెల్ ఒప్పందం చేసుకుంది. ఇక జనవరిలో ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు లైవ్ కనెక్టివిటీని అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌కు ముఖ్యమైన మార్కెట్లలో భారత్ కూడా ఒకటన్న ఆయన హైదరాబాద్‌లో ఓ కొత్త క్యాంపస్‌ను గూగుల్ నిర్మించనుందని, ఇక్కడి నుంచే భారత్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్స్‌ను అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్ వినియోగంలో అమెరికాను భారత్ మించిపోనుందన్నారు. వచ్చే ఏడాదిలో గూగుల్‌కు అమెరికా కంటే భారత్ అతిపెద్ద మార్కెట్ కావచ్చన్నారు. ఇక దేశీయంగా ఇంజినీరింగ్, వ్యాపారాభివృద్ధికి పెట్టుబడులు పెట్టనున్నామని, ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనున్నామని తెలిపారు. బెంగళూరులో మరిన్ని నియామకాలు జరపనున్నట్లు చెప్పిన పిచాయ్.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కోసం ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తామన్నారు. దేశంలోని మూడు లక్షల గ్రామాలను కలుపుకెళ్తామన్నారు.
త్వరలో భారత్‌కు ప్రాజెక్ట్ లూన్
త్వరలోనే భారత్‌కు ప్రాజెక్ట్ లూన్‌ను తెస్తామన్నారు సుందర్ పిచాయ్. ఆకాశంలో బెలూన్లను ఏర్పాటు చేసి ఎల్‌టిఇ లేదా 4జి అని పిలిచే వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ వినియోగం ద్వారా నేరుగా మొబైల్ వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించే ప్రాజెక్టు ఇది. ఇందుకు కావాల్సిన సెల్యులార్ స్పెక్ట్రమ్ కోసం టెలికాం సంస్థలతోనూ ప్రాజెక్ట్ లూన్ భాగస్వామ్యమవుతుంది. ఒక్కో బెలూన్ సామర్థ్యం దాదాపు 40 కిలోమీటర్లని పిచాయ్ తెలిపారు. బెలూన్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలను సౌర, పవన శక్తితో తీర్చనున్నట్లు చెప్పారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ప్రోడక్ట్స్‌ను నిర్మించిన సుందర్ పిచాయ్.. చెన్నైకి చెందినవారనేది తెలిసిందే. ఇక గూగుల్ ఉపాధ్యక్షుడు (యాక్సెస్ స్ట్రాటజీ, ఎమర్జింగ్ మార్కెట్స్) మరియన్ క్రోక్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వౌలికాభివృద్ధిని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు రాజన్ ఆనందన్ మాట్లాడుతూ 2018 నాటికి ఆన్‌లైన్ వినియోగదారులు 500 మిలియన్లకుపైగా ఉంటారని, దేశంలోని 29 రాష్ట్రాల్లో 23కుపైగా భాషలు వాడుతున్నారన్నారు. ఈ క్రమంలో 11 భాషల్లో గూగుల్ సేవలను అందిస్తున్నామన్నారు.
chitram...
న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న పిచాయ్