తెలంగాణ

వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో గురువారం హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను, నాలాలకు ఇరువైపులా ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పాత భవనాలను ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు పెరిగింది. లుంబిని పార్కులోకి వరదనీరు చేరింది. 15 ఏళ్ల తర్వాత పార్కులోకి వరదనీరు మళ్లీ వచ్చిందని, ఔట్‌ఫ్లో పెంచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యాసంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించాలని జనార్దన్‌రెడ్డి అధికారులకు సూచించారు.