తెలంగాణ

ఐడి కార్డుంటేనే ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ఫిబ్రవరి 2న జరిగే పోలింగ్‌పై అధికారులు కాస్త ముందు నుంచే దృష్టి సారించారు. ఒకవైపు పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లకు తావివ్వరాదని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలింగ్ రోజు నగరవాసులు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసి గానీ, జిహెచ్‌ఎంసి సిబ్బంది నుంచి గానీ తీసుకున్న ఓటరు స్లిప్ చూసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లవచ్చునని కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి వివరించారు. కానీ లోనికి వెళ్లిన తర్వాత నిర్దిష్టమైన ఎన్నికల గుర్తింపు కార్డును గానీ, ప్రత్యామ్నాయంగా మరో 21 రకాల ఐడి కార్డులలో ఏదో ఒకటి చూపితేనే ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ అధికారులు అనుమతిస్తారని ఆయన వివరించారు. ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో జారీ చేసిన పుస్తకాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు, ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందు జారీ చేసిన రేషన్ కార్డులు, ఆహార భద్రత కార్డులు, ఫొటో కల్గి ఉన్న ఎస్సీ,ఎస్టీ కులధృవీకరణ పత్రాలు, ఫొటో కల్గిన వికలాంగుల గుర్తింపు సర్ట్ఫికెట్, ప్రజాప్రతినిధులకు సచివాలయం ద్వారా అందించిన ఫొటో గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం ద్వారా అందిన జాబ్‌కార్డు, బార్ కౌన్సిల్ సభ్యులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ అందజేసిన గుర్తింపు కార్డులు, కార్మిక శాఖ అందించిన హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ఏటిఏం కార్డులు, స్మార్ట్ కార్డులు, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు వంటివి చూపి కూడా నగరవాసులు ఓటు వేయోచ్చునని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
‘నోటా’కు నో
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బ్యాలెట్‌లో ‘నోటా’ ఉండదు. బ్యాలెట్ పేపర్‌లో ఉండే అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడానికి ఓటరుకు ఇష్టం లేకపోతే తిరస్కరించేందుకు వీలుగా 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ‘నోటా’ (పైన తెలిపిన వారెవ్వరూ కాదు) తీసుకుని వచ్చింది. బ్యాలెట్ పేపర్‌లో చివర ‘నోటా’ ఉంటుంది. అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడానికి ఇష్టం లేనప్పుడు ‘నోటా’పై ముద్ర వేయవచ్చు. అయితే గ్రేటర్ బ్యాలెట్ పేపర్‌లో ‘నోటా’ లేకపోవడంతో ఓటర్లకు ఇది ఒకింత నిరాశే. చట్ట సభలకు జరుగుతున్న ఎన్నికల బ్యాలెట్‌లో ‘నోటా’ ఉన్నప్పుడు గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్‌లో ఉండకపోవడానికి కారణం ఉంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లోనూ ‘నోటా’ ఉండాలంటే, తప్పని సరిగా 1955 సంవత్సరంలోని ఎంసిహెచ్ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. చట్ట సవరణకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. చట్ట సవరణ లేకుండా ‘నోటా’ పెట్టేందుకు వీలు లేదు.