అవీ .. ఇవీ..

ఇదో రకం కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరప్‌లో అందమైన, చారిత్రక ప్రాంతాలను ఓ చిన్న కాగితం ముక్క కలిపి అందమైన ఆకృతులను సృష్టించడం మెక్‌కర్‌కు అలవాటు. ఈ కళకు పేపర్‌బొయె అని పేరుకూడా పెట్టాడు. ప్రఖ్యాత మిలీనియం డోమ్, ట్రఫాల్గర్ స్వేర్‌ల పైనాకిందా కాగితం ముక్కలను పెట్టి ఎలాంటి థ్రిల్ కల్గించాడో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది.
బిగ్‌ఫైట్
భీకరంగా నోరుతెరిచిన ఈ మొసలిని తెగ చిరాకుపెట్టింది ఓ అడవిబల్లి. ఈ అందమైన దృశ్యాన్ని బంధించిన ఇండోనేషియా ఫ్రొటోగ్రాఫర్ పేరు హెండి. సోనీ ఏటా నిర్వహించే ప్రపంచ ఫొటోగ్రఫీ కంటెస్ట్‌లో ఈ చిత్రానికి మొదటి బహుమతి దక్కింది. సన్‌బాత్ చేస్తున్న మొసలిపై ఈ బల్లి హఠాత్తుగా దాడి చేసినప్పుడు హెండీ తన కెమేరాను క్లిక్‌మన్పించాడు.
చాక్‌లెట్ గర్ల్
ఈమె పేరు కెమిల్లా సెర్ప్. మిస్ ఫ్రాన్స్-2015గా ఎంపికైంది. ఈమధ్య అమెరికాలో నిర్వహించిన చాక్‌లెట్ ఫెస్టివల్‌లో ఇలా పూర్తిగా చాక్‌లెట్‌తో తయారు చేసిన డ్రెస్ వేసుకుని కనువిందు చేసింది.
మాస్క్‌తో సర్ఫింగ్
సంచలనం రేపిన అలనాటి చిత్రం మాస్క్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదిగో ఆ చిత్రంలో హీరో వేసుకున్న విధంగా డ్రెస్ వేసుకుని సర్ఫింగ్ చేస్తున్న ఇతగాడి పేరు డేవిడ్ నికల్సన్. ఈ 21 సంవత్సరాల కుర్రాడు ఈ మధ్య కాలిఫోర్నియాలో జరిగిన హలోవిన్ సర్ఫింగ్ ఫెస్టివల్‌లో ఇలా పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నాడు.

-భారతి