ఆంధ్రప్రదేశ్‌

ట్రంప్ విజయంతో ముమ్మిడివరప్పాడులో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా దేశంలో రిపబ్లికన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో సైతం సంబరాలు జరుపుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన ఇరగవరపు అవినాష్ ప్రస్తుతం ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ఆరిజోనా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తుండడమే దీనికి కారణం. హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ విజయం సాధించారన్న విషయం తెలియగానే ముమ్మిడివరప్పాడు గ్రామంలోని అవినాష్ బంధువులు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. అవినాష్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఆయన పెదనాన్న, ముమ్మిడివరప్పాడు ఉప సర్పంచ్ ఇరగవరపు రాజమోహనరావు బుధవారం తెలిపారు. ఇరగవరపు తమ్మిరాజు గతంలో మునసబుగా పనిచేసే వారు. ఆయన కుమారుడు పాపారావు పెద్ద కుమారుడైన అవినాష్ రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, లక్నోలో ఎంబిఎ వరకు చదివారు. రాజకీయ కుటుంబం కావడంతో చిననాటి నుండే అవినాష్ రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. దేశంలోని రాజకీయ పార్టీలపై ప్రజల అభిప్రాయాలను డేటా అనాలసిస్ చేస్తుండేవారు. కాగా భార్య రంజన అమెరికాలో ఉద్యోగం చేస్తుండడంతో ఆమెను కలిసేందుకు విజిట్ వీసాపై అరిజోనా రాష్ట్రానికి వెళ్లిన అవినాష్ అనుకోకుండా రిపబ్లికన్ పార్టీ డేటా అనలిస్టుగా చేరారు. అక్కడ గవర్నరు పదవికి జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి జూసీకి గెలుపు వివరాలపై ఇ-మెయిల్స్ పంపేవారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిభను గుర్తించి పరిశీలకునిగా విధులు అప్పగించారు. అలాగే క్రమంగా ఆరిజోనా రాష్ట్రానికి పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. దీంతో ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రచారంలో వ్యూహాలు రచించే బృందంలో అవినాష్ కీలకపాత్ర పోషించారు. తాజాగా ట్రంప్ విజయం సాధించడంతో ఆ ఘనతలో అవినాష్ కూడా పాలుపంచుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ముమ్మిడివరప్పాడు గ్రామంలోని ఆయన బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
chitram...
ట్రంప్‌తో అవినాష్