సబ్ ఫీచర్

ఇవి తింటే కంటి జబ్బులు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు వయసు పైబడినవారిలో కంటి జబ్బులు వచ్చేవి. నేడు చిన్న పిల్లల్లో నే ఇవి వెంటాడుతున్నా యి. సరైన పోషకపదార్ధాలు తీసుకోకపోవటం వల్ల చిన్న వయసులోనే పిల్లలు కళ్లజోళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు పనిచేస్తూ కూర్చునేవారికి కంటికి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న వయసు నుంచే పిల్లలను ఇంటర్నెట్, టివీలకు అలవాటు చేయటం వల్ల కళ్ల నుంచి కారటం, కళ్లు సరిగా కనిపించకపోవటం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. కంటికి సంబంధించిన సమస్యల నివారణకు మనం తీసుకునే ఆహారంలో ఎలాంటివి ఉంటే మంచిదో పలు పరిశోధనలు వెల్లడయ్యాయి.
కంటి జబ్బులు నుంచి దూరం చేసే శక్తి కాయగూరలు, పండ్లు తినటం వల్ల లభిస్తుందని ఎయిమ్స్ వైద్యుల బృందం జరిపిన విస్తత్ర పరిశోధనలలో వెల్లడైంది. అలాగే పేదవాడి యాపిల్‌గా పిలువబడే జామ కంటికి ఎంతో మేలు చేస్తుందని ఆలిండియా మెడికల్ సైన్స్ వైద్యులు చెబుతున్నారు. నల్లద్రాక్ష, కొత్తిమీర, మెంతికూరను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవటం వల్ల దృష్టి లోపాలను నివారించుకోవచ్చు. పరిశోధనలలో వెల్లడైంది. ఎయిమ్స్ వైద్యుల బృందం 25 పండ్లు, 75 కూరగాయల శాంపిల్స్‌పై పరిశోధనలు చేశారు. జామకాయ, మెంతికూర, కొత్తిమీరలలో కంటి చూపు జబ్బులను చాలావరకు నివారించుకోవచ్చని వీరు వెల్లడిస్తున్నారు. వీటిని వాడటం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే దృష్టిలోపాలను చాలావరకు నివారించుకోవచ్చు. కారోటినాయిడ్స్ అనేవి పచ్చటి ఆకుల్లోనూ, కూరగాయాల్లోనూ, పసుపుపచ్చ కూరగాయాల్లోనూ ఉంటాయని వీరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో వండే సాంప్రదాయ వంటకాల్లో వీటిని చేర్చితే ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. బీన్స్, క్యారెట్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మునగ ఆకులు, అల్లం, గుమ్మడికాయ, సొరకాయ, పొట్లకాయ, మామిడి పండ్లు తదితరవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేసేవే.