ఆంధ్రప్రదేశ్‌

మేధావుల ఆలోచనల బాటలో ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖులను స్మరించిన ఆర్థికమంత్రి యనమల

హైదరాబాద్, మార్చి 10 : మేధావులు, ప్రముఖ కవులు, తాత్వికవేత్తలు తదితరుల ఆలోచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. గురువారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ..అనేక మంది ప్రముఖుల అభిప్రాయాలను ‘కోట్’ చేశారు. భారత పూర్వ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ‘ఏదైనా సాధికారికంగా నేర్చుకున్నప్పుడు సృజనాత్మకత వికసిస్తుంది. సృజనాత్మకత వికసించినప్పుడు ఆలోచన పరిమళిస్తుంది, ఆలోచన పరిమళించినప్పుడు విజ్ఞానం ప్రకాశిస్తుంది. విజ్ఞానం ప్రకాశించినప్పుడు ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది’ అన్నారు.
రాష్ట్ర సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని యనమల చెబుతూ, స్వామి వివేకానందను ఉటంకించారు. ‘ఏదైనా ఒక భావాన్ని స్వీకరించకండి. ఆ భావాన్ని, ఆ ఆలోచనను మీ జీవిత సర్వస్వంగా మార్చుకోండి. దాని గురించే ఆలోచించండి. కలగనండి. దానికోసమే జీవించండి. మీ మెదడు,కండరాలు, నరాలు మీ దేహంలో సమస్త అవయవాలనూ ఆ భావంతోరగిలిపోనివ్వండి. ఆ ఒక్క భావానికి తప్ప మరే ఆలోచనకి చోటివ్వకండి, మీరు విజయం సాధించాలంటే ఇదే మార్గం’ అంటూ వివేకానంద చెప్పిన మార్గంలో నడుస్తున్నామని యనమల తెలిపారు.
అంతర్జాతీయంగా పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎపి అభివృద్ది పథంలో నడుస్తోందని చెబుతూ, షేక్‌స్పియర్ అన్నమాటలు గుర్తు చేశారు. ‘నన్ను నన్నుగానే చిత్రించు. ఏ మాత్రం తక్కువ చేయవద్దు.’ అన్నారని, ఇవే మాటలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు.
బడ్జెట్ లెక్కలను కొంత మంది సందేహంతో చూస్తున్నారని ప్రస్తావిస్తూ, విన్‌స్టన్ చర్చిల్ మాటలను గుర్తు చేశారు. ‘నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఇబ్బంది చూస్తాడు,కాని ఆశావాది ప్రతి ఇబ్బందిలోనూ కొత్త అవకాశాన్ని చూస్తాడు’ అంటూ ప్రస్తావించారు.
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ‘ఆదర్శవంతమైన సమాజం గతిశీలకంగా ఉండాలి. ఆ సమాజంలో ఒక చోట సంభవించిన పరివర్తన తక్కిన అన్నిచోట్లా పరివర్తనకు దారితీసే అవకాశాలతో నిండి ఉండాలి’ అన్నారని, అందుకే పేదల అభ్యున్నతి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని యనమల చెప్పారు.