బిజినెస్

వాణిజ్యానికి బుల్లెట్ స్పీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: భారత్-జపాన్‌ల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఇనుమడించింది. ఇరు దేశాల ప్రధానులు మోదీ, షింజో అబేల మధ్య సోమవారం జరిగిన 13వ వార్షిక శిఖరాగ్ర భేటీ సందర్భంగా అనేక కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బులెట్ ట్రైన్, నౌకారంగంలో సహకారాన్ని విస్తరించుకోవడం సహా రెండు దేశాలు ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక అంశాలో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి కూడా మోదీ-షింజోలు విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు మరింతగా సహకారాన్ని విస్తృత పరచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై కూడా దృష్టిసారించారు. చైనా తన కండబలాన్ని చాటుకుంటున్న ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి, పురోగతిపై ఏకాభిప్రాయం ఇరువురు నేతల మధ్య ఈ సందర్భంగా వ్యక్తమైంది.నియమ నిబంధనల ఆధారిత, సమీకృత ప్రపంచ వ్యవస్థ కోసం కృషి చేయాలని సంకల్పించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ, కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాదుగొల్పాలని, చట్ట పాలనే ధ్యేయంగా కృషిచేయాలన్న బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజా,వాణిజ్య సంబంధాలను ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఉద్ఘాటించారు. ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులతో 2ప్లస్2 చర్చలను నిర్వహించేందుకు అంగీకరించారు.అమెరికాతో కూడా భారత్‌కు ఇదేరకమైన ఒప్పందం ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. గత నెల్లో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం మాట్లాడిన మోదీ ‘డిజిటల్ భాగస్వామ్యం నుంచి సైబర్‌స్పేస్, ఆరోగ్యం, రక్షణ సహా అన్ని రంగాల్లోనూ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకుంటాం’అని తెలిపారు. భారత్-జపాన్ సంబంధాల్లో అత్యంత కీలకమైన ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పురోగతిని ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ మారక ద్రవ్య సాయానికి సంబంధించీ ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది.
భారత దేశ సాంప్రదాయక వైద్య విధానాలైన ఆయుర్వేదం, యోగాల పరివ్యాప్తికి మరింతగా కృషి చేయాలని భారత్-జపాన్‌లు సంకల్పించాయి. ఈ వీటిపై తొలి సారిగా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల ప్రజలకు పరిపూర్ణమైన వైద్యాన్ని, ఆరోగ్యాన్ని అందించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు భారత ఆయుష్ (ఆయుర్వేదం, నేచురోపతి, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి), జపాన్ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

చిత్రం..ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతున్న భారత్-జపాన్ బృందాలు