అంతర్జాతీయం
మా దేశానికి రాకండి..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాషింగ్టన్: కరోనా వైరస్ భయంతో అమెరికా వణికిపోతున్నది. విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యను పరిమితం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అదేవిధంగా వివిధ కార్యక్రమాలనూ రద్దు చేసుకుంది. అందులో భాగంగానే స్పెయిన్ రాజు ఫెలిప్-6, రాణి లెటిజియా పర్యటనకు బ్రేక్ వేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియా ట్రంప్‌తో స్పెయిన్ రాజు, రాణి వచ్చే నెల 21వ తేదీన సమావేశం కావాల్సి ఉంది. ఆ తర్వాత వారిద్దరికి ట్రంప్ దంపతులు విందు ఇస్తారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకోవాల్సిందిగా స్పెయిన్ రాజు వర్తమానం పంపించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్ట్ఫోనింగ్ గ్రీష్మం తెలిపింది. ప్రస్తుతం అమెరికా దృష్టి మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపైనే ఉందని ఆమె తెలిపింది. ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తన ప్రకటనలో పేర్కొంది. 2018 ఏప్రిల్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, 2019 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌కు లభించిన అరుదైన గౌరవం స్పెయిన్ రాజు, రాణికి దక్కాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహామ్మారి విజృంభిస్తున్న కారణంగా అమెరికా ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్న నిర్ణయంతో వారు ఈ అవకాశాన్ని కోల్పోయారు.