అంతర్జాతీయం

కరోనా మృతులు 13,444

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత మరింత జఠిలంగా మారుతోంది. దాదాపు 100 కోట్ల మంది ఇళ్లకే పరిమితమైపోయే పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 13,444కు పెరిగింది. దాదాపు 170 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. దాదాపు 35 దేశాలు లాక్ డౌన్ పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ విశ్వప్రయత్నం చేస్తున్నప్పటికీ దీని తీవ్రత పెరుగుతూనే ఉంది. దేశాల మధ్య సరిహద్దులు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే, ఈ వైరస్ కారణంగా తలెత్తిన ఆర్థికపరమైన ఉత్పాతాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వాలు వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేసి అత్యవసర చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకినట్టు తాజా లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇటలీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 4,800కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం ఇటలీలోనేనన్న విషయం స్పష్టమవుతోంది. దేశంలో అన్ని అత్యవసరం కాని ఫ్యాక్టరీలను మూసేస్తున్నట్టు దేశ ప్రధాని గూరుూసిపే వెల్లడించారు. ఆరు కోట్ల మంది జనాభా కలిగిన ఇటలీ ఇప్పుడు కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ ఈ వైరస్ సోకిన వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇక అమెరికాలోని అనేక పట్టణాల్లోని ప్రజలు లాక్ డౌన్‌కు అలవాటు పడుతున్నారు. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజెల్స్ సహా అనేకచోట్ల తీవ్రంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ వైరస్‌పై చేపట్టిన యుద్ధంలో తాము విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోపక్క ప్రపంచ నేతలంతా ఈ మహమ్మారిని జయించి తీరాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఐరోపాలోని దేశాల్లోనే ఈ వ్యాధి తీవ్రత నానాటికీ పెరుగుతోంది. స్పెయిన్‌లో మరణాల సంఖ్య ఏకంగా 32 శాతం పెరిగింది. రానున్న రోజులు మరింత కఠినమైన రోజులను ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్ హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో వైరస్ మృతుల సంఖ్య 562కు పెరిగింది. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రభుత్వపరంగా అత్యవసర చర్యలెన్నో తీసుకుంటున్నారు.
మరోపక్క ఆసియాలో ఈ వైరస్ రెండో దశ మొదలు కానుందన్న ఆందోళన తీవ్రం కావడంతో ఇక్కడి దేశాలు దీనిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. బ్రిటన్ కూడా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలూ చేపడుతోంది. దాదాపు 15 లక్షల మంది ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించిన దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఎవరూ ఇళ్లు కదలవద్దని హెచ్చరించారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, జనం బయటకు రాకుండా నిరోధించేందుకు పోలీసులు, వైద్య సిబ్బంది ఇమ్మిగ్రేషన్ అధికారులకు అదనపు అధికారాలను ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

*చిత్రం... దూరం.. దూరం