విజయనగరం

పట్టణవాసికి ఇంటిభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 20: నిధుల లేమితో జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమం నిలచిపోయిన తరుణంలో కేంద్రప్రభుత్వం జిల్లాకు పట్టణ గృహనిర్మాణ కార్యక్రమం కింద 11వేలకుపైగా ఇళ్లను మంజూరు చేసింది. ఈ గృహనిర్మాణాలను జిల్లాకేంద్రం విజయనగరంతోపాటు జిల్లాలోని మిగతా నాలుగు మున్సిపాలిటీలలోనూ చేపడతారు. ఎన్నికల హామీలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పిన టిడిపి, అధికారంలోకి వచ్చాక నిధుల లేమితో కొత్తగా ఇళ్లు మంజూరు చేయటం అటుంచి, కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన ఇళ్లలో అవకతవకలు జరిగినట్లు చెబుతూ ఆ ఇళ్ల నిర్మాణాన్ని ఆపివేసింది. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్లకు బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన విషయంలో అధికారులు వివిధ కారణాలు చెబుతున్నా, నిధుల కొరత అసలు కారణంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన గృహనిర్మాణాలను జియోట్యాగింగ్ చేసి వాస్తవ పరిస్థితులపై ఒక నిర్ధారణ వచ్చాక కొత్తగా ఇళ్ల మంజూరు మొదలుపెడతారని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతూ వస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఇక ఇళ్ల మంజూరు లేనట్లేనని ప్రజలు భావిస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం పట్టణ గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన విభాగాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాలకు భారీగా గృహాలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రెండు లక్షల ఇళ్లు కేటాయించగా, వాటిలో విజయనగరం జిల్లాకు 11,353 ఇళ్లు దక్కాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో 9222 ఇళ్లు నిర్మిస్తారు. సాలూరు మున్సిపాలిటీకి 588ఇళ్లు, బొబ్బిలి మున్సిపాలిటీకి 382ఇళ్లు, పార్వతీపురం మున్సిపాలిటీకి 836ఇళ్లు మంజూరు చేసారు. నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలో 325ఇళ్లు నిర్మిస్తారు. కేంద్రం మంజూరు చేసిన మొత్తం ఇళ్లలో కొన్ని ఇళ్లు లేఔట్లలో నిర్మించగా, మరికొన్ని లబ్ధిదారుల సొంత ఇంటిస్థలాల్లో నిర్మిస్తారు. మిగతా లబ్ధిదారులకు రాష్ట్రప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమం కింద 450చదరపు అడుగులతో నిర్మించే ప్రతి ఇంటికి 1.50లక్షల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తుంది. మిగతా నిధులు రాష్ట్రప్రభుత్వం వివిధ మార్గాల్లో సమకూర్చవలసి ఉంటుంది. ప్రస్తుతం మంజూరు చేసిన ఇళ్లను రెండేళ్లలో పూర్తిచేయవలసి ఉంటుంది. కేంద్రం నుంచి ఈ ఇళ్ల మార్గదర్శకాలు విడుదలయితే పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇళ్ల మంజూరులో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని కొంత మేరకయినా తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు.