రాష్ట్రీయం

జనశక్తి.. వనరుల పుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: కొత్త పరిశ్రమల ఏర్పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాలుగానూ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అపారఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు, సుదీర్ఘ సముద్రతీర ప్రాంతం రాష్ట్రానికి ఉందని, అలాగే వీటన్నింటినీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా, మూడో రోజు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) ‘ఇనె్వస్టర్స్ మీట్’లో చంద్రబాబు మాట్లాడుతూ, తాను దావోస్ రావడం పదో పర్యాయమని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి తనకు తెలిసింది కాకుండా, తెలియని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నానని, ఈ అంశంలో తాను ‘నిత్య విద్యార్థి’ని అని చెప్పుకున్నారు. ఎపిలో ఉన్న వనరులను వినియోగించుకునేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిఐఐ ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు ఈ సందర్భంగా కూలంకషంగా సమాధానాలు ఇచ్చారు. అంతర్జాతీయంగా సరాసరి అభివృద్ధిరేటు 2.5 శాతం కాగా, భారత్‌లో అభివృద్ధి శాతం 7.5 శాతంగా ఉందని తెలిపారు. మరింత లోతుగా పరిశీలిస్తే భారత్‌లోని వివిధ రాష్ట్రాల వృద్ధిరేటు పరిశీగణనలోకి తీసుకుంటే, ఎపిలో వృద్ధిరేటు ఎక్కువగా ఉందన్నారు. ఎపిలో అభివృద్ధిపైనే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీఠ వేస్తున్నామని, పేదల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అభివృద్ధి-సంక్షేమం సమానంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ కోణంలోనే అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
ఎపిలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచడంలో విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అభివృద్ధికి నిధులు అనేవి సమస్య కాదని, ప్రభుత్వ ఖజానా నుండి నిధులు ఖర్చు చేయకుండానే అభివృద్ధిసాధ్యమవుతుందన్నారు. ఇందుకు ఉదాహరణగా సైబరాబాద్, హైదరాబాద్‌లను తానే ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఇందుకోస అనేక అత్యుత్తమ విధానాలను అనుసరించామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అతి సులువుగా చేశామన్నారు. భూసేకరణకు సంబంధించి కొంత మంది అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రైతులు, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచారని, సంక్షోభాన్ని కూడా సవాలుగా స్వీకరించి, సమస్యను పరిష్కరించామని తెలిపారు. పెద్ద సమస్య అనుకున్న భూసేకరణ అతిసులువుగా పూర్తయిందని, రైతులు పెద్దమనసుతో తమ భూములను ప్రభుత్వానికి అప్పగించి సహకరించారని గుర్తు చేశారు.
పుట్టపర్తిలో ఎంఆర్‌ఓ స్థాపన
--------------------
ఎయిర్‌బస్ సిఇఓతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, రక్షణ-అంతరిక్ష పరిశోధనా రంగాలకు ఎపి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందన్నారు. ఎపిలోని శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం కూడా ఉందని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో విమానయాన రంగానికి అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన రంగానికి సంబంధించి మెయింటేనెన్స్-రిపేర్స్-ఓవర్‌హాలింగ్ (ఎంఆర్‌ఓ) సెంటర్ స్థాపనకు పుట్టపర్తి పట్టణాన్ని పరిశీలించాలని సూచించారు.
మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ను సందర్శిస్తానిన ఎయిర్‌బస్ సిఇఓ ఈ సందర్భంగా బాబుకు హామీ ఇచ్చారు. ఎపిలో నెలకొల్పే తమ ప్లాంట్‌కు త్వరలోనే శంకుస్థాపన తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.