మహబూబ్‌నగర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 22: ఈ నెల 25వ తేదిన జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌కు సూచించారు. శుక్రవారం సాధారణ పరిపాలన భవనం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం అవిర్భవం జరిగి 50 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రతి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు ఉపన్యాసం, క్విజ్, డ్రాయింగ్, పెయింటింగ్, రంగోళి వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో గెలెపొందిన వారిని జిల్లా స్థాయికి పంపాలని, జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపాలని తెలిపారు. విద్యార్థులచేత ర్యాలీలు, మానవహారాలు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని తెలిపారు. విస్తృత ప్రచారం కల్పించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటర్‌గా బాధ్యత నిర్వహించుకే ఓటరు గుర్తింపు కార్డును పొందాలని, ఓటర్ దినోత్సవం రోజు బూత్‌స్థాయి అధికారి, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ప్రభుత్వేతర స్వచ్చంధ సంస్థలు ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతిజ్ఞ చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదిన నియోజకవర్గాల వారిగా కళాశాల విద్యార్థులచే వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్, పెయింటింగ్, రంగోళి వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 22వ తేదిన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అధికారులు, స్వచ్చంద సంస్థలతో ఓటర్లకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఓ భాస్కర్, సి-సెక్షన్ సూపరింటెండెంట్ ప్రభాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.