బిజినెస్

జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో నేడు రెండో యూనిట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 26: ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటైన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికే కాకుండా దేశానికే తలమానికమని ఏపీ జెన్‌కో ఎండి విజయానంద్ కొనియాడారు. శుక్రవారం కర్మాగారంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కర్మాగారం ఏర్పాటయిందని గుర్తుచేశారు. కూలింగ్ టవర్ల నిర్మాణానికి జర్మనీ నిపుణులు సహకరించారని తెలిపారు. సుమారు రూ. 12,300 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ కర్మాగారం మొదటి యూనిట్ గత ఏడాది ప్రారంభమైందని, ప్రస్తుతం రెండో యూనిట్ ప్రారంభ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శనివారం జరగనుందని వెల్లడించారు. దీంతో రోజుకు 39 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వివరించారు. వేసవి విద్యుత్ అవసరాలను కూడా తీర్చగలిగే స్థాయికి వచ్చామని, కేవలం రాష్ట్ర అవసరాలకు మాత్రమే కాకుండా వాణిజ్యపరంగా కూడా విద్యుత్‌ను అమ్ముతున్న తొలి ప్రభుత్వరంగ సంస్థగా ఏపీ జెన్‌కో ఆవిర్భవించిందని ప్రకటించారు. విద్యుదుత్పత్తి, మిగులు, ఆదాయ వ్యయాలు, విద్యుత్ ఆదా వంటి అంశాల్లో ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. రెండో యూనిట్ ప్రారంభంతోపాటు మూడో యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. మరోవైపు రాబోయే నాలుగైదేళ్లలో మరో 7,210 మెగావాట్ల విద్యుదుత్పాదనకు ఏపీ జెన్‌కో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు విజయానంద్ తెలిపారు. ఆర్‌టీపీపీ ద్వారా 600 మెగావాట్లు, విజయవాడ ఎన్‌టిటిపిఎస్ ద్వారా మరో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలోని ఎస్‌డి ఎస్‌టిపిఎస్ ద్వారా ఇంకో 800 మెగావాట్ల వంతున 2019 నాటికి అదనపు విద్యుత్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న వడ్లవల్లేరు థర్మల్ ప్రాజెక్టు ద్వారా 400 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుందని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పని కార్యాచరణ దశలో ఉందన్నారు.
కాగా, పర్యావరణ ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ కర్మాగారంలో శుభ్రపరచిన బొగ్గునే వాడుతున్నామన్నారు. అందులోనూ 70 శాతం స్వదేశీ గనుల నుంచి, మరో 30 శాతం విదేశీ బొగ్గును ఉపయోగిస్తున్నందున కాలుష్య శాతం గణనీయంగా తగ్గిందని వివరించారు. అదే విధంగా కర్మాగార ఉద్యోగులకు వౌలిక వసతులు కల్పించడానికి ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. వారంతా మంచి వాతావరణంలో నివసించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సామాజిక బాధ్యతగా సమీప గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగా పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలను నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేపట్టనున్న 3వ యూనిట్ నిర్మాణం మరో మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు విద్యుత్ కేంద్రం సిఇ సత్యనారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.