రాష్ట్రీయం

జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇడి అభ్యర్థనను డిస్మిస్ చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నిర్వహణలోని జగతి పబ్లికేషన్స్‌లోకి 34 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన కేసును సిబిఐ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ ఇడి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది. క్విడ్ ప్రొ కో ప్రాతిపదికన మాధవ రామచంద్రన్, ఎకె దండమూడి, టిఆర్ కన్నన్‌ల నుంచి పెట్టుబడులు స్వీకరించిందంటూ జగతి పబ్లికేషన్స్‌పై ఐపిసి, మని లాండరింగ్, అవినీతి నిరోధక చట్టాల కింద సిబిఐ అనేక కేసులు దాఖలు చేసింది. అయితే మనీ లాండరింగ్ చట్టానికి సంబంధించిన కేసులను విచారించడానికి నగర మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును కేంద్రం ప్రత్యేక కోర్టుగా గుర్తించిందని, దీని దృష్ట్యానే జగతి పబ్లికేషన్స్ కేసును తమకు బదిలీ చేయాలని కోరుతున్నామని ఇడి తెలిపింది. ఇప్పటికే ఇడి కోర్టులో అనేక ఫిర్యాదులు దాఖలు చేశామని, నిందితులకు సమన్లు కూడా జారీ చేశామని తెలిపింది.