మెయిన్ ఫీచర్

మహిళకు వెన్నుదన్ను సుప్రీం (నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21వ శతాబ్దంలోని ప్రస్తుత అధునాతన సాంకేతిక సమాజంలోని భారతీయ మహిళా భాగస్వామ్యం, సమానత సాధించే పోరాటాలలో శాంతియుత మానవీయ సంస్కరణల విలువలు ప్రసాదించే జీవన లక్ష్యాలను నిర్దేశించుకొంటోంది. సమానత్వ హక్కుల కోసం ఒకే అస్తిత్వ ఆధిక్య వాదానికి, శక్తి యుక్తుల ఐక్యతకు కట్టుబడే స్ర్తివాద పోరాటం, ప్రస్తుతం మహిళలు సాధిస్తున్న విద్యా ప్రగతిశీల ప్రగాఢ భావోత్తేజం కారణంగా కొత్త పుంతలు అనుసరిస్తోంది. పాశ్చాత్య దేశాల జీవన భావజాలాన్ని అందిపుచ్చుకొన్న భారతీయ మహిళ, క్రమేపీ మరింత స్వేచ్ఛ, సమానతా న్యాయం సాధించటానికి సాహసిస్తోంది. కుటుంబంలో, సమాజంలో వివక్షకు గురవుతున్న సామాన్య, మధ్యతరగతి, సంపన్న మహిళలకు విద్యాధికులైన మేధావంతులైన మహిళలు కొండంత అండగా నిలబడే ఆలోచనల కార్యాచరణ పుంజుకుంటోంది.
ఈ నిలదీసి ప్రశ్నించే తత్వం ప్రబలటంతో, యువ మహిళా లోకం ఎంతో హింసాయుత వేదన, దౌర్జన్య అరాచకత భరించవలసి వస్తోంది. అదే విధంగా అణికిమణిగి పడి వుండని ఆడతనం పట్ల విద్వేషం అమానవీయ రాక్షస నేరప్రవృత్తి పెచ్చు పెరుగుతోంది. స్ర్తి, పురుష సంబంధాలలో నెలకొని వున్న ప్రకృతి సహజమైన లైంగికత, జీవితాలకు ప్రాధాన్యం కావటంతో ఔదలదాల్చక తప్పని పరిస్థితులలో, పురుషాధిక్య సమాజం తప్పని కారణంగా, నేర ప్రవృత్తివిచ్చలవిడిగా హింసా, లైంగిక దాడులు చెలరేగుతున్నాయి.
మానవ జీవనం ఎంత అధునాతన శాస్ర్తియ, సాంకేతిక జీవన శైలిని అందిపుచ్చుకొన్నా, ఆధ్యాత్మికత, మత ఆరాధనా ప్రాధాన్యతతో ముడిపడి వుంది. ఏ సమాజ నడవడికలో అయినా ప్రవక్తలు, మహాత్ములు, ఆధ్యాత్మిక వేత్తలు, సంస్కర్తలైన మేధావుల ప్రభావం శాస్త్ర విజ్ఞానంతో సమానంగా జీవితాలను నడిపిస్తుంది.
ఒకానొక కాలంలోని సదాచారాలు, మత దురాచారాలుగా నిరసించి పారద్రోలబడుతున్నాయి. పురుషాధిక్య సమాజంలోని సతీసహగమనం, బాల్య వివాహాలు, లైంగిక అణచివేతలు, బహుభార్యాత్వం మహిళలను శాసించి పీడించిన రోజుల నుంచి స్వేచ్ఛ, సమాన న్యాయం, విద్యా ఉపాధి అవకాశాలు, పాలనా రంగంతో సహా అన్ని రంగాలలో భాగస్వామ్యం కోసం ఇంటా బయటా సంస్కరణాయుత పోరాటాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
సాధికారికత ఎంత వరకు సాధ్యం?
జనాభాలో 49 శాతం మహిళలున్న భారత దేశంలో, రాజకీయాలలో మహిళా ప్రాతినిధ్యం అత్యంత అవమానకరంగా వుంది. తొలి లోక్‌సభకు ఎన్నికైన మహిళా పార్లమెంటు సభ్యులు 22 (4.5 శాతం) కాగా ప్రస్తుతం ఉభయ సభల్లో 91 సీట్లు (11.6 శాతం) వున్నాయి. ప్రపంచంలో మహిళా ఎంపీల అంశంలో మనదేశం 145వ ర్యాంక్‌లో వుంది. 33 శాతం రిజర్వేషన్ 2010లో రాజ్యసభలో గట్టెక్కి, 15వ లోక్‌సభ రద్దుతో మాయమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రస్తుత దేశ ఉపాధ్యక్షుడైన వెంకయ్యనాయుడు అప్పుడప్పుడు ప్రస్తావించటం తప్ప ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఆ బిల్లుపై ఆసక్తి, చిత్తశుద్ధి లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళా సాధికారితా స్థితి అత్యంత దయనీయంగా వుంది. ఎక్కువ శాతం మహిళా ఎంపీలున్న దేశం రువాండా (63.8) కాగా అగ్ర సంపన్న దేశాలైన అమెరికా (21 శాతం) చైనా (23.6 శాతం) రష్యా (14.9)లు మహిళా సాధికారిత పట్ల తీవ్రమైన వివక్షతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికీ మహిళలకు ఓటు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించకుండా పీడించుకొనే అనాగరికత, రాజ్యం చేస్తోంది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు మహిళా ప్రాతినిథ్యాన్ని మహిళ ఓట్లు గుంజుకొనే కృషి కోసం తప్ప సమాన అవకాశాలు చట్టబద్ధంగా కల్పించటానికి ముందుకు రావటం లేదు. 1867లో మహిళలకు ఓటు హక్కు యివ్వాలనే సవరణ ప్రతిపాదనకు 194 మంది వ్యతిరేకంగా ఓటు చేయడంతో నాటి పార్లమెంటు తిరస్కరించింది. ఇంత వరకు అమెరికాలో మహిళ, ప్రెసిడెంట్ కాలేదు. ఇక మనదేశంలో రాష్టమ్రుఖ్యమంత్రులుగా మమతా బెనర్జీ, మాయావతి వంటి వారు తప్ప కుటుంబ రాజకీయ నేపథ్యం వలననే మహిళలు రాణిస్తున్నారు. ఓటుహక్కు, పోటీ చేసే హక్కు సాధించటానికే మహిళా ప్రపంచం ఇంత వరకు సర్వశక్తులు ధారపోసి పోరాడవలసి వచ్చింది.
పాశ్చాత్య నాగరికతా భావజాలపు వెనె్నల వెలుగులు ప్రసరించటం వల్ల, భారతీయ మహిళా మేధస్సు కేవలం ఇంటి పని, వంట పనులకు పరిమితం కాకుండా, పురుషునితో దీటుగా కుటుంబంలో, సమాజంలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది. పేద, మధ్య తరగతి మహిళలు కూడా ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబాలకు మార్గదర్శకం అవుతున్నారు.
ఆత్మరక్షణకు సాయుధీకరణ!
స్ర్తి, పురుష సమానత్వం రాజ్యాంగ సందేశమని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఏ మతమైనా ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ నెలకొన్న సంప్రదాయాన్ని, రాజ్యాంగ నిబంధనల పరిధిలో సుప్రీం కోర్టు పరిశీలించి తీర్పులు యివ్వటం ఇటీవల సంచలనాత్మకమైంది. 2016లో మహారాష్టల్రోని ప్రఖ్యాత శనిసింగనాపూర్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించకుండా, 400 సంవత్సరాల నాటి నిషేధం, ఆలయ ట్రస్ట్ బోర్డు ఎత్తివేయవలసి వచ్చింది. అదే విధంగా శబరిమల ఆలయ బోర్డు 10-50 ఏళ్ల లోపు మహిళలను అనుమతించని అంశం న్యాయ వివాదమైంది. రుతుక్రమ కారణంగా మహిళలు, 41 రోజులు శుద్ధత కొనసాగించలేరని ఆలయ బోర్డు పేర్కొన్నప్పుడు, ధర్మాసనం, రుతుక్రమానికి, శుద్ధతకు సంబంధం లేదని ఇలాంటి చర్యను రాజ్యాంగ సూత్రాలు అనుమతించవని స్పష్టం చేసింది. నైష్ఠిక బ్రహ్మచారి అయ్యప్ప స్వామి నిష్ఠకుమహిళల ఉనికి, మతాచారానికి సంబంధించి భంగమని కేరళ ప్రభుత్వం సుప్రీంకు విన్నవించింది. ముంబైలోని హాజీ అలీదర్గా ట్రస్ట్, కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ గర్భగుడి ప్రవేశం, నిషేధాలు భూమాత రణ్‌రాగిణి బ్రిగేడ్, భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్, వాఘిని మహిళా సంఘటన వంటి మహిళా సంస్థల న్యాయపోరాటం సత్ఫలితాలను ఇచ్చింది. అదే విధంగా ఇస్లాంమత సంబంధిత ముమ్మారు తలాక్ పద్ధతి రాజ్యాంగ బద్ధంగా కాదని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు సంచలనం సృష్టించింది. మతాచారాలను అన్యాయ, అనాగరికతలు లేకుండా మానవీయంగా సంస్కరించుకొనే సామాజిక న్యాయాన్ని సర్వోన్నత న్యాయస్థానం, విశిష్ట తీర్పులతో స్వాగతిస్తోంది.
ఆడతనం పట్ల మైండ్ సెట్, వికృత హేలగా జీవిత భద్రతను హరిస్తోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా లైంగిక క్రూరత్వం, స్వైరవిహారంతో ఉసురు తీస్తోంది. స్నేహం, ప్రేమ, పెళ్లి, ఏ బాంధవ్యాన్ని యువతి నమ్మినా ఉన్మాద రూపంలో మోసం చేసే పాశవికత స్వేచ్ఛగా శృతి మించుతోంది. ప్రభుత్వ భయం, సమాజనీతి, కుటుంబ సంబంధాలు ఏవీ రక్షించలేక మహిళలు నిస్సహాయంగా బలి అవుతున్న దుర్ఘటనలు పెరుగుతున్నాయి. సాధికారత సాధించే లక్ష్యం అటుంచి, భారతీయ మహిళ ఆత్మరక్షణకు ఆయుధం చేపట్టవలసిన అగత్యం తలఎత్తింది.

-జయసూర్య సెల్: 9440664610