తెలంగాణ

హక్కుల కోసమే యూనియన్లు లేవు:అశ్వత్థామరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేవలం హక్కుల కోసమే యూనియన్లు లేవని, ఆర్టీసీ అధికారులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని, వెంటనే కార్మిక సంఘాల యూనియన్లకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చరిత్రలో ఇది ఒక చారిత్రిక సమ్మె అని అన్నారు. యూనియన్లు ఉండాలా వద్దా అనేది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు. యూనియన్ నేతలకు చట్ట ప్రకారం కొన్ని మినహాయింపులు ఉంటాయని అన్నారు. కార్మికులతో రెఫరెండం పెట్టి యూనియన్లు ఉండాలా వద్దా అనేది తేల్చాలని అన్నారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయనని ప్రకటించటం సంతోషకరమని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనాలు వెంటనే చెల్లించాలని కో-కన్వీనర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. యూనయన్లను రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదని అన్నారు.