రాష్ట్రీయం

కాంట్రాక్టు ఉద్యోగులకు జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18 వేలమందికి పైగా లబ్ధి
నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ
బ్యాక్‌లాగ్ ఖాళీలూ భర్తీ చేస్తాం
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
సర్కార్‌పై రూ.500 కోట్ల భారం
వారంలో కారుణ్య నియామకాలు
15వేల టీచర్ పోస్టుల భర్తీకి ఓకే

హైదరాబాద్, జనవరి 2: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించాలని మంత్రి మండలి నిర్ణయించింది. నెలాఖరులోగా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10.30 వరకు జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శనివారం పొద్దుపోయాక మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 18 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు అంచనా వేశామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో బ్యాక్‌లాగ్ పోస్టులు ఏవైనా ఖాళీగావుంటే వాటినీ వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడానికీ మంత్రిమండలి ఆమోదించినట్టు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం మూడు కేటగిరీలు ఉన్నాయని, వీరిలో రూ.6700 వేతనం పొందుతున్న ఉద్యోగుల వేతనాన్ని రూ.12 వేలకు, రూ.8400 వేతనం పొందుతున్న ఉద్యోగుల వేతనాన్ని రూ.15వేలకు, రూ.10 వేల వేతనం పొందుతున్న వేతనాన్ని రూ.17 వేలకు పెంచుతున్నట్టు సిఎం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచడంవల్ల రూ.450 నుంచి రూ. 500 కోట్ల భారం పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లోవున్న కారుణ్య నియామకాలను వారంలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగావున్న 15వేల 628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందులో 12వేల 25 పోస్టులు ఇతర విద్యా సంస్థలకు సంబంధించి ఉండగా, మిగిలిన పోస్టులన్నీ మైనారిటీ విద్యా సంస్థలవేనన్నారు. ప్రస్తుతం మైనారిటీ శాఖపరంగా ఉద్యోగులు ఎవరూ లేరని, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వాళ్లే కొనసాగుతున్నారన్నారు. ఇకముందు అలాకాకుండా మైనారిటీ శాఖకు ప్రత్యేకంగా జిల్లాల్లో ఆరుగులు, డైరెక్టరేట్‌లో 20మంది అధికార్లు ఉండేలా ఆ శాఖ పరిధిలో నియామకాలు జరుపుతామన్నారు. మొత్తంగా 80మంది అధికారులను మైనారిటీ శాఖలో నియమించేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. నీటి పారుదల శాఖలో 108 ఖాళీలు, వరంగల్ ఎంజిఎంలో 147 ఖాళీలు, మహబూబ్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే వైద్య కళాశాల్లో 462 ఖాళీల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు.