రాష్ట్రీయం

మావో నేతకు బెయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమానత్ సమర్పించిన విరసం నేత
కరీంనగర్, నవంబర్ 23: దివంగత మాజీ శ్రీపాదరావు హత్య కేసులో నిందితుల్లో ఒకరైన మావోయస్టుల నేత బచ్చు ప్రసాద్ సింగ్‌కు బెయల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో అతనికి విరసం నేత వరవరరావు సోమవారం కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో జమానత్ సమర్పించారు. శ్రీపాదరావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న మల్లా రాజిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 34 మంది మావోయస్టు నేతలపై కరీంనగర్ రూరల్ పోలీసులు క్రైం.నం.1/2008 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరవరరావు విలేఖరులతో మాట్లాడుతూ ఏడు సంవత్సరాలు దాటినప్పటికీ ఈ కేసులో ఇంతవరకు పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయకపోవడం దారుణమని అన్నారు. జైళ్లో ఏడేళ్లు పూర్తి చేసుకున్న మావోయిస్టులను జనవరి 26న విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పడితే మావోయిస్టు ఏజెండ అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారుతెలంగాణ పేరుతో కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఎఎస్‌ఐ మోహన్ రెడ్డి చేపట్టిన అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.