తెలంగాణ

తుమ్మిడిహట్టి ఎత్తు ఎందుకు తగ్గించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయిలో కెసిఆర్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకు, ఇప్పటి పాలనకు పొంతన లేదు
డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకం లోపభూయిష్టం
సిఎం కెసిఆర్‌పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 13: గోదావరి నదిపై తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు రాజీపడాల్సి వచ్చిందని కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును నిలదీశారు. ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహారాష్ట్ర కోరిందని, అందుకు అంగీకరించలేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత దీర్ఘకాలిక ప్రయోజనాలను పక్కన పెట్టి 152 మీటర్లకు గాను 148 మీటర్ల ఎత్తు కట్టేందుకు అంగీకరించి రావడం వెనుక అసలేం జరిగిందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న జీవన్‌రెడ్డి ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముంబయి వెళ్లిన కెసిఆర్ ఒక్కసారిగా అలా ఎందుకు మనసుమార్చుకున్నారో, అక్కడ ఏం జరిగిందో గానీ ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఇక భవిష్యత్తులో పెంచుకునే అవకాశం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. గోదావరి నదిపై చేపట్టే ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నామని చెబుతున్న కెసిఆర్, అఖిల పక్షంతో సంప్రదించి ఎందుకు చేయలేదని అన్నారు. ఒకవైపు ఎలాంటి ఒప్పందాలు జరగలేదని మహారాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి ప్రకటిస్తే, ఇక్కడ ఏదో సాధించామంటున్న కెసిఆర్ ప్రకటనలకు పొంతన లేదని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో 40 కరువు మండలాలను గుర్తించాల్సి ఉండగా, 19 గుర్తించి మిగిలిన వాటికి సాగునీటి లభ్యత ఆశించిన స్థాయిలో ఉన్నందున పక్కనపెట్టామని ప్రభుత్వం చెబుతోందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని అన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు పునరావాసంపై సిఎం ఇచ్చిన హామీ ఒక్క అడుగు ముందుకు పడలేదని అన్నారు. పరిహారం లేదు, ప్రత్యామ్నాయంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని స్వయంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రకటన చేశారని, అదీ కార్యరూపం దాల్చ లేదన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఒక్క అడుగు ముందుకు పడ్డం లేదని అన్నారు. డబ్బు సరిపోకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్న సంగతి ప్రభుత్వానికీ తెలియదా అని ప్రశ్నించారు. చినముల్కనూరును దత్తత తీసుకున్న కెసిఆర్ అక్కడ ఒక్క డబుల్‌బెడ్ రూం ఇల్లు నిర్మించలేదని అన్నారు. పోలవరం ముంపు మండలాలు ఏడు ఆంధ్రలో కలిస్తే నోరు విప్పలేదు, ఇప్పుడు తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గింపు ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంటారు, ఏం ఇచ్చిపుచ్చుకున్నారు, తెలంగాణకు ఏం ప్రయోజనం కలిగిందని జీవన్‌రెడ్డి సభలో ఉన్న కెసిఆర్‌ను ఉద్దేశించి పదే పదే ప్రశ్నించారు. కెజి టు పిజి ఆంగ్ల విద్య అన్నావు, మిషన్ కాకతీయ పేరు మార్చి భగీరథ పథకం అన్నావు, ఆ పనులు ఎక్కడ జరిగాయన్నారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి, అక్కడ ప్రభుత్వంతో మాట్లాడదాం, ప్రధాని మోదీని కూడా కలుసుకుని సమస్యలను పరిష్కరించుకునేదానికి కృషి చేద్దామని జీవన్‌రెడ్డి సిఎంకు సూచించారు. రుణమాఫీ, రైతుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉంటే రైతులకు ఏదో చేశానని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడం కాదా అని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం రూ.30 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చింది, మీ నిర్లక్ష్యం వల్ల కాదా అని నిలదీశారు. అప్పటికే జీవన్‌రెడ్డి చాలా సమయం తీసుకోవడంతో స్పీకర్ మధుసూధనాచారి మైక్ కట్ చేశారు. రెండు నిమిషాలంటూ పదే పదే కోరడంతో అనుమతించారు. అనంతరం ప్రభుత్వం తరఫున సిఎం ప్రసంగించాలని స్పీకర్ ప్రకటించడంతో సిఎం కెసిఆర్ సభ్యులు అడిగిన అంశాలపై వివరణ ఇచ్చారు.