కరీంనగర్

దళితుల అభివృద్ధిపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 8: దళిత సం క్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ళ కాలంలో దళితుల కోసం చేపట్టిన అభివృద్ధిపై శే్వతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ రాష్టన్రేత, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషితోనే జిల్లాలోని చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో చర్మపరిశ్రమ ఏర్పాటుకు కేం ద్రం అంగీకరించిందని, అనంతరం జరిగిన పరిణామాలతో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. వాస్తవాలను వక్రీకరిస్తున్న అధికారపార్టీ నేతలు కాంగ్రెస్‌పై తప్పుడు ప్ర చారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో ప్రజాపోరాటాలు చేస్తే జీర్ణించుకోకుండా దుష్ప్రచారం చేస్తుండటం హేయనీయమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో దళితులను మోసం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని బుట్టదాఖలు చేసి, నియంతపాలన కొనసాగిస్తుందని దుమ్మెత్తిపోశారు. సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్,నాయకులు టేల భూమయ్య, ఎర్ర శ్రీనివాస్, తదితరులున్నారు.